విబ్రి మోషన్ పిక్చర్స్, కర్మా మీడియా ఎంటర్టైన్ మెంట్ సంయుక్త నిర్మాణంలో, కొలివుడ్ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దివంగత తమిళనాడు సీఎం జయలలిత బయోపిక్ చిత్రం తలౌవి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నది. బాలివుడ్ నటి కంగనా రౌనత్ ప్రధానపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో వెటరన్ హిరో అరవిందస్వామి ఎంజీ రావచంద్రన్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. చిత్రాన్ని రెండు భాగాలుగా తీయనుండగా, మొదటి భాగం జూన్ 26న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పుడు చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ టీజర్ అందరినీ ఆకర్షిస్తున్నది. సినిమాపై భారీ అంచనాలను పెంపొందించుతున్నది.
తమిళనాడు మాజీ సీఎం, దిగ్గజ నటుడు ఎంజీ రామచంద్రన్ జయంతిని పురస్కరించుకుని తలైవి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను దర్శకుడు ఏఎల్ విజయ్, సినిమా యూనిట్ జనవరి 17న విడుదల చేసింది. ఈ టీజర్ అందరినీ మంత్రముగ్దులను చేస్తున్నది. ఇందులో హిరో నటుడు అరవిందస్వామి రామచంద్రన్ పాత్రలో ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నది. వేషధారణతో పాటు, బాడీ లాంగ్వేజ్ సైతం రామచంద్రన్‌ను తలపిస్తుండడంపై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నది. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మాట్లాడుతు.. తలైవిలో పనిచేసిన తన అనుబవాలను, రామచంద్రన్ పాత్రను రక్తి కట్టించేందుకు నటుడు అరవిందస్వామి చేస్తున్న కృషిని వివరించారు. జయలలిత పాత్రకోసం కంగాన రౌనత్‌ను ఎంపిక చేసిన అనంతరం రామచంద్రన్ పాత్ర కోసం అనేక మందిని సంప్రదించామని, చివరగా అందుకు అరవిందస్వామినే సరిపోతారని ఎంచుకున్నామని వెల్లడించారు. మా నమ్మకాన్ని నిజం చేస్తూ నటుడు అరవిందస్వామి రామచంద్రన్ పాత్రలో ఒదిగిపోతున్నారని, పరిపూర్ణమైన నటనను కనబరుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సాధారన మాటలతో దిగ్గజ నటుడు రామచంద్రన్‌ను తలపిస్తూ ఆయనకు పాత్రకు ప్రాణం పోస్తున్నారని కొనియాడారు. తలైవి చిత్రానికి దర్శకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.