టాలీవుడ్లో ఆర్ ఎక్స్ 100 తో క్రెజ్ తెచ్చుకొన్న కార్తికేయ మరో రొమాంటిక్ లవ్ అండ్ యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. గత కొద్దిరోజులుగా టీజర్, సాంగ్స్ తో చిత్రానికి విస్థృతంగా ప్రచారం కల్పిస్తున్న చిత్ర యూనిట్ ఈరోజు ట్రైలర్ విడుదల చేసింది. అనూప్ రూబెన్స్ రూపొందించిన సాంగ్స్ ఇప్పటికే యూత్ లో ఆదరణ పొందాయి.అయితే ఇప్పుడు 90ఎంఎల్ పేరుతో తెరకెక్కిన సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది.
యెర్రా శేఖర్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతుండగా కార్తికేయ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్నారు. 90ఎంఎల్ లో కార్తికేయ కి జంటగా నేహా సోలంకి నటిస్తుండగా అజయ్, అలీ, పోసాని మురళీకృష్ణ, రావు రమేష్, రవి కిషన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ ట్రైలర్‌ను దర్శకుడు ఎంతో చక్కగా కట్ చేశారు. 90ఎంఎల్ చిత్ర ట్రైలర్‌లో ప్రేమ, సెంటిమెంట్‌ను ఎంతో చక్కగా చూపించారు. కార్తికేయతో హీరోయిన్ నేహా సోలంకీ లిఫ్ లాక్ సీన్ ఆకట్టుకునేలా ఉంది. కార్తికేయ నిత్యం తాగడం అనే కాన్సెప్ట్ లో నటించారు.
చిన్నప్పుడు సిరప్ తాగించినట్లు లిక్కర్‌ను అలవాటు చేయగా అది క్రమ క్రమంగా రోజుకు మూడు పూటలు 90ఎంఎల్ తాగడమే అలవాటుగా మారుతుంది. కార్తికేయ అస్సలు మద్యమే ముట్టని ఇంటిలో పుట్టిన నేహాను ప్రేమిస్తాడు. ఆ ప్రేమ ఎంతగా ఉంటుందంటే ప్రేమ కోసం హీరోయిన్ చనిపోయేంతగా. కానీ ప్రేమ కోసం అతడు లిక్కర్ తాగడం మానుకోడంటే సినిమాలో లిక్కర్‌కు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో అర్థవుతుంది ట్రైలర్ చూస్తుంటే. ఏదేమైనా 90ఎంఎల్ కార్తికేయ కేరీర్‌లో ఓ మంచి సినిమాగా నిలిచే అవకాశం ట్రైలర్ చూస్తుంటే కనిపిస్తుంది.