పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాపై ఓ సంచనల వార్త ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హల్ చల్ చేస్తోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా యూనిట్ నుంచి అధికారిక ప్రకటన చేయలేదు కానీ, అనధికారికంగా వస్తున్న కథనాల ప్రకారం మాత్రం ఈ సినిమా ఆర్ ఆర్ ఆర్ అభిమానులకు పండుగలాంటి ప్రచారమే అని చెప్పవచ్చు. ఇంతకు ఆర్ ఆర్ ఆర్ వార్తలంటే ఎక్కడ లేని ఆసక్తి అందరిలో ఉంటుంది. ఇంతకు ఈ వార్త ఏమై ఉంటుంది అనుకుంటున్నారా..
ఆర్ ఆర్ ఆర్ సినిమాను ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళీ అలియాస్ జక్కన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఇప్పటి దాకా అనేక పుకార్లు షికారు చేశాయి. హీరోలు గాయపడ్డారు.. హీరోయిన్లు దొరకడం లేదు.. అందుకే సినిమా అనుకున్న టైమ్‌కు విడుదల కావడం లేదు.. అనే పుకార్లు వచ్చాయి.
అయితే వీటిని ఫటాపంచలు చేస్తూ దర్శకధీరుడు జక్కన్న సినిమాకు ఇటీవలే ఓ లేటేస్ట్ అఫ్డేట్ ఇచ్చాడు. అందేమంటే.. యంగ్ టైగర్‌కు సరిజోడిగా బ్రిటీష్ భామను, మొయిన్ విలన్లను ఎంపిక చేశారు. సినిమా కూడా దాదాపుగా 70శాతం పూర్తి చేసినట్లు గా ప్రకటించారు. ఇంకా 30శాతం సినిమాను కేవలం నెలన్నర లోపే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. అంటే సినిమా అనుకున్న సమయం కన్నా ముందే సినిమా షూటింగ్ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే సినిమాను కూడా ప్రకటించిన సమయం కన్నా ముందే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఇప్పుడు కొత్తగా వినిపిస్తుంది. అయితే సినిమా ప్రకటించిన తేదికన్నా ముందే విడుదల చేస్తారా.. లేక సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా ఆర్ ఆర్ ఆర్ సినిమా అనుకున్న సమయానికి రావడం పక్కా అని తేలిపోయింది.