దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తున్నారే సస్పెన్స్‌కు తెరదించింది చిత్ర బృందం. ఇంతకాలం జూనియర్ ఎన్టీఆర్‌కు జోడి దొరకకపోవడంతో ఆర్ ఆర్ ఆర్ లోని కీలకమైన సన్నివేశాలు షూటింగ్ చేయలేదు. అయితే ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తున్నట్లు చిత్ర బృందం బుధవారం ప్రకటించి అభిమానులకు పండుగలాంటి వార్తను తెలిపింది.
జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించబోయే ఒలివియా మోరిస్ 7 ట్రైల్స్ ఇన్ 7 డేస్ అనే టీవి సీరిస్ లో నటించింది. దర్శక ధీరుడు రాజమౌళీ జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు తగినట్లుగా ఇంగ్లీష్ హీరోయిన్ కావాలని మొదటి నుంచి భావిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికే ఇద్దరిని ఎంపిక చేసినప్పటికి ఇద్దరు వారి వారి వ్యక్తిగత కారణాలతో చిత్రం నుంచి తప్పుకున్నారు. అయితే ఎన్టీఆర్‌కు సరిజోడిని దొరకబట్టడం కష్టంగా మారిన నేపథ్యంలో అసలు ఇంగ్లీష్ భామ దొరకుతుందా.. లేక లోకల్ హీరోయిన్‌నే ఎంపిక చేస్తారా అనే అనుమానాలు వచ్చాయి. చివరికి రాజమౌళీ తాను అనుకున్న మాటకు కట్టుబడి ఇంగ్లీష్ నటిని ఎంపిక చేసి తన పట్టుదలను నిరూపించుకున్నారు.
ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కు జోడి దొరికిన నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన మరో కీలకమైన నటుడిని ఎంపిక చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో మొయిన్ విలన్‌గా ఎవరు నటిస్తున్నారు అనే ఆంశానికి కూడా తెరదించారు జక్కన్న. ఈ సినిమాలో విలన్‌గా రే స్టీవన్ సన్ నటించబోతున్నాడు. ది థీరీ ఆఫ్ ఫ్లైట్ లో నటించాడు. పనిషర్ వార్ జోన్ తో బ్రేక్ సాధించిన ఈ విలన్ గా నిలదొక్కుకున్నాడు. ఇప్పడు టీవీ షోలు చేస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో అలీ సెన్ డూడీ అనే ఇంగ్లీష్ భామ కూడా నటిస్తుందని ప్రకటించింది చిత్ర యూనిట్. జేమ్స్ బాండ్ లాంటి సినిమాలో నటించింది.