ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం కోసం బాలివుడ్‌ అగ్రహీరో సిద్ధం

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం కొత్త అంశంతో తెలుగు చిత్రసీమలో చర్చనీయాంశంగా నిలుస్తున్నది. ప్రేక్షకుల్లో హైప్‌ను పెంచుతున్నది. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, జక్కన్న రాజమౌళి కలయికలో వస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ఇప్పటికే టాలివుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హిస్టరికల్‌ ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం సెట్స్‌కు మీదకు వెళ్లక ముందు నుంచే ఆసక్తి నెలకొల్పుతున్నది. ఇద్దరు యంగ్‌ హీరోల సరసన హాలివుడ్‌ నటి ఓలివియా మోరిస్‌ను, బాలివుడ్‌ నటి ఆలియాభట్‌ను ఎంపిక చేసిన రాజమౌళి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తాజాగా చిత్రం మొత్తం రూ. 450 కోట్లతో తెరకెక్కుతుండగా అందులో ఏకంగా భారీ మొత్తాన్ని కేవలం పతాక సన్నివేశాల చిత్రీకరణకే వెచ్చించనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు జక్కన్న. ఏకంగా క్లైమాక్స్‌ కోసం రూ. 150 కోట్లను వెచ్చించనున్నట్లు తెలుస్తున్నది.

ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే 75శాతం మేరకు పూర్తయినట్లు టాలివుడ్‌ వర్గాల సమాచారం. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌లో బాలివుడ్‌ అగ్రహీరో అజయ్‌దేవగణ్‌ పాల్గొంటుండడం మరోసారి వార్తల్లో నిలిచింది. చత్రపతి శివాజీ వద్ద సుబేదార్‌గా పనిచేసిన తానాజీ బయోపిక్‌తో బాలివుడ్‌లో ఇటీవలె భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో ఒక అతిథి పాత్రలో మెరవనున్నాయి. ఆ సన్నివేశాలను చిత్రీకరణను ఇటీవలే హైదరాబాద్‌లో దర్శకధీరుడు రాజమౌళి ప్రారంభించారు. అందులో నటించేందుకు అజయ్‌దేవగణ్‌ ముంబాయి నుంచి హైదరాబాద్‌కు మంగళవారం విచ్చేశారు. ఆయన రాజమౌళి స్వాగతం పలికారు. సెట్‌లో ఆయనతో కలిసి జక్కన్న దిగిన ఫొటోలను ఆ చిత్రయూనిట్‌ అభిమానులతో సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ”ఇవ్వాల్టీ నుంచి అజయ్‌జీతో షూటింగ్‌ను ప్రారంభించడానికి మేమంతా ఎగ్జైటింగ్‌గా ఉన్నాం” అని సినిమా యూనిట్‌ ప్రకటించింది. ఇప్పుడు ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Tags: BOLYWOOD STAR AJAYDEVAGHAN, RRR Movie, SS Rajamouli