అసురన్‌ తెలుగు రిమేక్‌కు మాస్‌ టైటిల్‌ ఫిక్స్‌..!

తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న అసురన్‌ సినిమా తెలుగు రిమేక్‌పై వస్తున్న వార్తలు ఎప్పటికప్పుడు కొత్త చర్చలకు దారి తీస్తున్నాయి. టాలివుడ్‌ వర్గాల్లో ఎంతో ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి. కొలివుడ్‌ అగ్రహీరో ధనుష్‌, మంజు వారియర్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట గతేడాది విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. బాక్సాఫీసు వద్ద సుమారు రూ. 150కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిందని ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాను తెలుగులో రిమేక్‌ చేయనుండగా అందులో విక్టరీ వెంకటేష్‌ నటించనున్నారు. సురేష్‌ ప్రోడక్షన్స్‌ నేతృత్వంలో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదరకు వెళ్లనుంది. ఇదే ఏడాది విడుదల కానుందని దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

తాజా ఈ సినిమాకు సంబంధించి మరోవార్త చర్చనీయాంశంగా మారింది. తెలుగు రిమేక్‌కు వస్తున్న ఈ సినిమాకు టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. ఇక్కడి నేటివిటికి తగ్గట్లుగా, తెలుగు సినీ అభిమానులను ఆకర్షించేలా సినిమాకు పేరును పెట్టారని సమాచారం. అందులో భాగంగానే అసురన్‌కు తెలుగు ‘నారప్ప’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు టాలివుడ్‌ వర్గాల సమాచారం. ఇప్పుడీ వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ టైటిల్‌కు వెంకటేష్‌ కూడా మొగ్గు చూపారని తెలుస్తున్నది.

Tags: ASURAN TELUGU REMAKE, Srikanth Addala, Venkatesh