స్టైలీష్‌స్టార్ బన్నీ అభిమానుల కోసం అలా వైకుంఠపురములో సినిమా ప్రమోషన్ భారీగా చేపట్టాడు. అయితే ఇప్పటికే చిత్ర ప్రమోషన్‌ను ఓ పీక్ స్టేజీకి తీసుకుపోయిన బన్నీ ఇప్పుడు మరో ప్రధాన ప్రమోషన్‌కు తెరలేపాడు. అలా వైకుంఠపురములో చిత్ర టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. అల్లు అర్జున్ తన అభిమానులను నిత్యం అలరిస్తూనే ఉన్నారు. తన చిత్ర ప్రమోషన్‌తో అభిమానులను ఓలలాడిస్తున్న బన్నీ ఇప్పుడు మరోమారు అభిమానులను రంజింప చేయబోతున్నారు. బన్నీ నటిస్తున్న చిత్రం అలా వైకుంఠపురములో చిత్ర ప్రమోషన్‌తో ఓ ఊపు ఊపుతున్న బన్నీ ఇప్పుడు ఈ సినిమా టీజర్ తో తన అభిమానులకు పండుగ వాతావరణం తెచ్చాడు. చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితం టీజర్ విడుదల చేయడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
హారిని హాసిని క్రియోషన్ నిర్మిస్తున్న ఈ చిత్రంను ప్రముఖ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు విడుదల చేసిన టీజర్‌తో దుమ్ములేపారనే చెప్పవచ్చు. ముందుగానే మీ నాన్న పెండ్లి కూతురు దాచినట్లు దాచాడు నిన్ను అనే మాటలతో టీజర్ ప్రారంభం అయింది. అల్లు అర్జున్ దుమ్మురేపే ఫైటింగ్.. ఫంచ్ డైలాగ్‌లు విపిరారు. స్టైల్‌గా ఉన్నాను కదా.. నాకు కూడా నచ్చింది అంటూ చాలా స్టైల్‌గా చెప్పడంతో సినిమాపై భారీ అంచనాలను పెంచాడు బన్నీ.
టీజర్లో బన్నీ ఫంచ్ డైలాగ్‌లు అదుర్స్ గా ఉన్నాయి. మాస్ లుక్‌లో తలపాగా చుట్టి.. నోట్లో బీడీ పెట్టి.. కొడవలిని ఓ ఇనుస కడ్డికి రాస్తే కొడవలి మొనకు వచ్చిన అగ్గితో బీడీ వెలిగించుకున్న తీరు త్రివిక్రమ్ మార్క్ స్టైల్‌కు నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడే కారు దిగావు.. నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కాను అనే డైలాడ్ సినిమాకే హైలెట్‌గా నిలిచేలా ఉంది. ఇక థమన్ సంగీతం బాగా ఉందనే చెప్పవచ్చు. సినిమాకు అలా వైకుంఠపురములో అని ఎందుకు పేరు పెట్టారో ఈ టీజర్లో తేల్చేశాడు దర్శకుడు. మొత్తానికి ఓ ఇంటికి ఉన్న పేరుతోనే అలా వైకుంఠపురములో ఏమీ జరిగింది.. ఏమీ జరుగబోతుంది అనేది కథగా ఉన్నట్లు ఆనవాల్లు కలిపిస్తున్నాయి.