అరుదైన ఘనతను సాధించిన ప్రిన్స్‌ మహేష్‌బాబు

సూపర్‌స్టార్‌, ప్రిన్స్‌ మహేశ్‌బాబు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా మరో రికార్డును నమోదు చేసింది. విడుదలైన ఏడు రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసిన చిత్రాల జాబితాల్లో చేరి అరుదైన ఘనతను సాధించింది. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో మహేష్‌బాబు, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన నాటి నుంచి రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతున్నది. తొలిరోజే సుమారు రూ. 32 కోట్లపైగా వసూలు చేసినట్లు ట్రేడ్‌వర్గాలు వెల్లడించాయి. వారం రోజులు గడిచినా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లతో చిత్రం దూసుకుపోతున్నది. ఇప్పటికీ నిలకడగా వసూళ్లను సాధిస్తుండడం గమనార్హం. ఇక ఏడు రోజు విడుదలైన కలెక్షన్లతో ప్రిన్స్‌ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరింది.

మహేష్‌బాబు నటించిన చిత్రం వరుసగా మూడోసారి ఆ క్లబ్‌లో చేరి అరుదైన ఘనతను సాధించారు. ఇంతకు ముందుకు మహర్షి, భరత్‌ అనే నేను సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాయి. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాకూడా ఆ జాబితాలో చేరడం విశేషం. అదీగాక ఆర్టీసీ రోడ్‌లో కలెక్షన్ల పరంగా సరిలేరునీకెవ్వరు చిత్రం ప్రభంజనాన్ని సృష్టిస్తున్నది. ఆ సెంటర్‌లో ఇప్పటి వరకు రూ. కోటి వసూలు చేసిన రికార్డు 49 సార్లు ఉన్నాయి. ఆ జాబితాలోనూ సరిలేరు నీకెవ్వరు చిత్రం చేరిపోయింది. రూ. కోటికి పైగా ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో వసూలు చేసింది. ఇప్పటి వరకు మహేష్‌బాబు ఆ సెంటర్లలో 9 సార్లు ఆ రికార్డును నమోదు చేశారు. ఆ ఘనతను ప్రభాస్‌, మెగాస్టార్‌ ఐదుసార్లు, పవన్‌కల్యాణ్‌, అల్లుఅర్జున్‌ నాలుగు సార్లు మాత్రమే బ్రేక్‌ చేయడం గమనార్హం. ప్రిన్స్‌ మరెన్ని రికార్డులు నమోదు చేస్తారో చూడాలి మరి.

Tags: Collections, MaheshBabu, Records, sarileeru nekevvaru