లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చే హీరోయిన్లు… అనుష్క శెట్టి, కాజల్, సమంత, నయనతార, రెజినా ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ నటీమణులు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు వస్తే కాదనరు.. కానీ ఎందుకు ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు వద్దన్నారు.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని వద్దనుకుంటే.. ఈ ఈషారెబ్బ మాత్రం ముద్దంది.. అందుకే రాగల 24గంటల్లో సినిమా చేసి అందరిని మెప్పించింది. హిట్ పట్టేసింది అని టాలీవుడ్ టాక్.
అయితే లేడీ ఓరియంటెడ్‌గా తెరకెక్కిన చిత్రం రాగల 24గంటల్లో చిత్రం. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది ఈషారెబ్బ. అయితే ఈషారెబ్బ ఈ సినిమాకు అనుకోలేదు దర్శకుడు శ్రీనివాసరెడ్డి. ముందుగా ఈ సినిమా కథ రాసిందే అనుష్క శెట్టికి సరిపోతుందని. కానీ అనుష్క చేయనంది. అందుకే ఈ ప్రాజెక్టు అనుష్క తరువాత కాజల్ అగర్వాల్ చెంతకు చేరింది. అమె కూడా నో చెప్పింది. తదుపరి ఈ కథ రెజినా వద్దకు వెళ్ళింది. రెజినా కూడా కథను రిజెక్టు చేసింది.
ఇక దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న సమయంలో అప్పుడు ఈషారెబ్బ వచ్చింది రంగంలోకి. ఈషా రెబ్బ ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు సిద్దమైంది. ఇంకేముంది శ్రీనివాసరెడ్డి తనదైన మార్క్‌తో సినిమాను తెరకెక్కించారు. హార్రర్, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం రాగల 24గంటల్లో.. ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పుడు ఈ కథను రిజెక్టు చేసిన ముగ్గురు ముద్దుగుమ్మలు ముఖం మాడ్చుకున్నారు. ఏదైనా రాసిపెట్టి ఉండాలంటారు పెద్దలు.. ఈషారెబ్బ కేరిర్‌కు ఈ సినిమా ఊపిరి ఊదినట్లే లెక్క.