చిత్ర పరిశ్రమలో ఇప్పుడు అంతా ఒక్కటే ట్రెండ్ నడుస్తోంది. అది బాలీవుడ్ అయినా.. టాలీవుడ్ అయినా.. కోలివుడ్ అయినా.. మాలీవుడ్ అయినా.. అంతా ఒకటే ట్రెండ్. అదే బయోపిక్‌ల కాలం. ఈ బయోపిక్ పుణ్యమా అని ఎందరో చరిత్రలో కనుమరుగైన వారి జీవితాలు వెలుగులోకి వస్తున్నాయి. అస్సలు చరిత్రే గుర్తించని వారి చరిత్ర తవ్వి తీస్తున్నారు. ఆనాటి తరానికి చెందినవారి జ్ఞాపకాలు, మరుపురాని సంఘటనలు, చరిత్ర సత్యాలు, ఈనాటి తరానికి అందించే బృహత్తరమైన పని చేస్తున్నది చిత్ర పరిశ్రమ.
అంతకు ముందు మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన చిత్రం మహానటి. ఈ సినిమాలో హీరోయిన్ కీర్తిసురేష్ సావిత్రి పాత్రకు జీవం పోసారు. ఇక అప్పటి నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమిళ వెండితెర ఇలవేల్పు జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించే పనికి పూనుకున్నారు తమిళ చిత్ర పరిశ్రమ. ప్రస్తుతం జయలలితపై మూడు బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా తళైవి. ఈ సినిమా కోసం చిత్ర పరిశ్రమ ఎంతో అతృతగా ఎదురు చూస్తుంది.
జయలలిత సిని ప్రస్థానం సాగించిన కాలంలో ఎన్నో మధురమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. జయలలిత, టాలీవుడ్ అందాల నటుడు శోభన్‌బాబు ల అనుబంధం గురించి చిత్ర పరిశ్రమలో కథకథలుగా చెప్పుకుంటారు. అయితే ఈ ఇద్దరి పాత్రలను ఈ సినిమాలో ప్రత్యేకంగా చూపించబోతున్నారు దర్శకుడు. జయలలిత, శోభన్‌బాబులు గాడంగా ప్రేమించుకుని పెండ్లి చేసుకునేందుకు సిద్దమయ్యారని, కాని ఎందుకో అది సాధ్యం కాలేదని పరిశ్రమలో టాక్. అయితే ఈ సినిమాలో ఈ ఇద్దరి పాత్రలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అయితే జయలలితగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తుండగా, శోభన్‌బాబుగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం విజయ్ దేవరకొండను చిత్ర బృందం సంప్రందించగా, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేనే సమాచారం. శోభన్‌బాబుగా విజయ్ దేవరకొండ నటిస్తే చిత్రానికి ప్రాంతీయ భాషల్లో మంచి ప్రాముఖ్యత వస్తుంది.