యంగ్ డైరెక్టర్ సుజిత్ భార్యని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు స్టార్ హీరోయిన్లు కూడా సరితూగరు..!

ప్రతిభ ఉంటే చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది అనేందుకు చిత్రపరిశ్రమలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్, ఇమేజ్ లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చినవారు ఆరంభంలో ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత వారు ఎన్నో అగ్ర శిఖరాలను అందుకున్నారు. అలా అందుకున్న వారిలో యంగ్‌ డైరెక్టర్ సుజిత్ కూడా ఒకరు.. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సినిమాల మీద ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశాడు.. రచయితగా కెరియర్ ప్రారంభించి తర్వాత శర్వానంద్ తో రన్ రాజా రన్ సినిమా తీసి మొదటి సినిమాతోనే బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

First Photos: 'Saaho' director Sujeeth weds Pravallika in Hyderabad

ఇక తర్వాత రెండో సినిమాకే ఏకంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సాహో సినిమా తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా సౌత్ లో అంతగా ఆకట్టుకోకపోయినా బాలీవుడ్ లో మాత్రం మంచి వసూలు రాబట్టుకుంది. ఇక ప్రభాస్ సాహూ విడుదల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని సుజిత్ రీసెంట్గా పవన్ కళ్యాణ్ తో #OG అనే సినిమా చేస్తున్నాడు. భారీ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై పవన్ అభిమానులో అంచనాలు మామూలుగా లేవు. ఎంతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ సంవత్సరం చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Saaho Director Sujeeth Gets Engaged to Pravallika |Sujeeth Engagement - YouTube

ఇక సుజిత్ సినిమాల విషయం పక్కన పడితే… సుజిత్ వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. సుజిత్ 2020ఆగస్టులో ఓ ఇంటి వాడయ్యాడు.. ప్రవల్లిక అనే అమ్మాయితో ఏడడుగులు వేశాడు. సుజిత్ ప్రవల్లికల‌ది ప్రేమ వివాహం..ఎంతోకాలంగా ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి 2020లో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.. ఈ జంటకి ఓ పాప కూడా జన్మించింది. అయితే ఇప్పుడు సుజిత్ భార్య ప్రవల్లిక గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

IN PICS: Prabhas-Shraddha Kapoor's 'Saaho' Director Sujeeth Gets Married In A Low Key Affair Amid Covid-19 Lockdown!

సుజీత్ వైఫ్ ను చూస్తే ఎవ్వ‌రైనా క‌ళ్లు తిప్ప‌కోలేరు. ప్రవల్లిక ముందు స్టార్ హీరోయిన్లు కూడా ప‌నికిరావు. అంత అందంగా ఆమె ఉంటుంది. ఈమె హైదరాబాద్ లోనే టాప్ 10 డెంటిస్ట్స్ లో ఒకరట.ఈమె నెల సంపాదన రూ.10 లక్షల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం. అంటే ఏడాదికి సుజిత్ సంపాదించే దానికంటే ఎక్కువ ప్రవల్లిక సంపాదిస్తుంది అన్నమాట.