టూ పీస్ బికినీలో రెచ్చిపోయిన హీరో వ‌రుణ్ సందేశ్ భార్య వితిక‌… ర‌చ్చ రంబోలా ఆడిస్తోందిగా…!

ఈ రీసెంట్ టైమ్స్ లో చిత్ర పరిశ్రమలో ఉండే అందాల భామలు తమ అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తున్నారు. ఎంతలా అంటే వారికి ఇష్టమైన అభిమానులు సైతం హీరోయిన్లపై బూతులు వర్షం కురిపించేంత దారుణంగా హాట్ ఫోటోషూట్‌లు చేస్తున్నారు. త‌మ అందాలను బరితెగించి ఆరబోయటమే కాకుండా పబ్లిక్ గా ఆ అందాలను చూపిస్తూ అభిమానులకు సైతం షాక్ ఇస్తున్నారు. చిత్ర పరిశ్రమలో ఉండే హీరోయిన్ల నుంచి స్టార్ హీరోల భార్యల వరకు టూ పీస్ బికినీ స్టైల్‌ ఎక్కువగా ఫాలో అవుతున్నారు.

వేసవిలో ఉష్ణోగ్రత పెరిగిపోయింది.. అన్న ఒక్క చిన్న రీజన్ తో నెటిజిన్ల‌ మీటర్లు పగిలిపోవాలన్న ఆలోచన ఏంటో ? తెలియదు కానీ టూ పీస్ బికినీతో టెంప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇదే లిస్టులో ఆడ్ అయిపోయింది టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ భార్య వితికా షెరు. హ్యాపీడేస్‌ సినిమాతో హీరోగా పరిచయమైన వరుణ్ సందేశ్ యూత్ ఫుల్ సినిమాతో పాపుల‌ర్ అయినా ఆ త‌ర్వాత మ‌నోడి కెరీర్ అంత అనుకూలంగా లేదు.

ఆ త‌ర్వాత త‌న భార్య వితిక‌తో క‌లిసి బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి కూల్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట వారి లైఫ్ నీ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్గా ఈ భామ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ.. వాటర్ ఫాల్స్ దగ్గర టూ పీస్ బికినీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన అభిమానులు మాత్రం వితికా షెరును వారి నోటికొచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆడుకుంటున్నారు.

అసలు నీకు కొంచమైన బుద్ధుందా ? ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకున్నావ్.. నీపై ఉండే గౌరవం మొత్తం పోయింది..అంటూ మరికొందరు కామెంట్లు పెడుతుంటే.. పూర్తిగా బరితెగించేశావ్ వితికా అంటూ ఎంతో దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఆ కామెంట్లకి ఈ ముద్దుగుమ్మ సైతం తన స్టైల్లో బోల్డ్ కామెంట్లతో రిప్లై ఇస్తోంది.

ఒకరు వేసుకున్న బట్టలు బ‌ట్టి ప్రేమ గౌరవం తగ్గుతుందా..? చీర కట్టుకుని సిమ్ చేయలేము కదా..? స్విమ్ సూటే వేసుకోవాలి అందుకే ఇలాంటి డ్రెస్ వేసుకున్నాను అంటూ ఒక్కొక్కరికి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం వితికా హాట్ బికినీ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి.