జ‌గ‌న్ కంచుకోట బ‌ద్ద‌లు… విరిగిన ఫ్యాన్ రెక్క‌లు… ఈ సారి సీమ టీడీపీదే..!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు గ్రేటర్ రాయలసీమగా చెప్పుకునే ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కంచుకోటలుగా ఉంటూ వస్తున్నాయి. ఈ ఆరు జిల్లాలలో 2014, 2019 ఈ రెండు ఎన్నికల్లోను వైసీపీ దే హవా. ఒక అనంతపురం జిల్లాలో మాత్రం 2014 ఎన్నికల్లో టిడిపి సంపూర్ణ ఆధిపత్యం చాటుకుంది. కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఈ ఐదు జిల్లాలలోనూ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా వైసీపీ స్పష్టమైన ఆధిప‌త్యం చాటుకుంది. దీనిని బట్టి ఇవి జగన్ కు ఎలాంటి ? కంచుకోటలో తెలుస్తున్నాయి.

మిగిలిన ప్రాంతాలలో జగన్ కు కొంత ఎదురుగాలి వీచినా రాయలసీమలో మాత్రం తమకు ఎప్పటికీ తిరిగి ఉండదని.. ఇంతకాలం ఆ పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటూ వచ్చారు. ఇది వాస్తవం కూడా. గత ఎన్నికల్లో రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. తెలుగుదేశం కేవలం మూడు చోట్ల మాత్రమే విజయం సాధించింది. మిగిలిన 49 స్థానాల్లో వైసిపి అభ్యర్థులు భారీ మెజార్టీలతో ఘన విజయాలు సాధించారు. ఇక గ్రేటర్ రాయలసీమలో ఒక్క ఎంపీ సీట్లు కూడా వైసిపి కోల్పోలేదు. దీనిని బట్టి ఇక్కడ ఆ పార్టీ ఎంత బలంగా ఉందో తెలుస్తోంది.

అలాంటి చోట ఇప్పుడు పట్టభద్ర ఎన్నికలు అధికార పార్టీ, జగన్ అంచనాలు తలకిందులు చేసేసాయి.
చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాలు కలిసి ఉన్న‌ రాయలసీమ తూర్పు పట్టభద్రుల నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి కంచ‌ర్ల‌ శ్రీకాంత్ ఏకంగా 35 వేల ఓట్ల పైచిలుకు భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ప్రకాశం జిల్లాలో కాస్త అటు ఇటుగా ఉన్న చిత్తూరు, నెల్లూరులో తమకు ఎదురులేదన్న నమ్మకంతో వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు మాదే గెలుపు అని ధీమాకు పోయారు. అయితే ఈ ఫలితం షాక్ ఇచ్చింది.

ఈ సీటులో వైసీపీ ఏకంగా 35 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం అంటే… వైసీపీకి ఇది నిజంగా ఘోర పరాజ‌యం కింద లెక్క. సీఎం జగన్ సొంత జిల్లా కడపతో పాటు ఆ పార్టీ కంచుకోట అయిన కర్నూలు – అనంతపురం జిల్లాలు కలిసి ఉన్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల‌ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ హోరాహోరీగా తల‌పడుతున్నాయి. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో టిడిపి దీనిని గెలుచుకున్న ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి - పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ అభ్యర్థి

ఇక్కడ నుంచి టిడిపి తరఫున పోటీ చేసిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అంచనాలకు మించి పోరాడారు. సీఎం సొంత జిల్లా కలిపి ఉన్న చోట కూడా వైసీపీకి భారీ ఆధిక్యం రాలేదు సరి కదా.. టిడిపి ఎంతో కొంత ఆధిక్యతతో దూసుకువెళ్లటం అధికార పార్టీ వర్గాలకు మింగుడు పడటం లేదు. ఏది ఏమైనా రాయలసీమలో యువకులు.. చదువుకున్న వారు.. మేధావులు, నిరుద్యోగుల మూడ్‌ ఎలా ? ఉందో ఈ ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. ఇదే వచ్చే ఎన్నికల్లోను కంటిన్యూ అయితే జగన్ కంచుకోట అనుకున్నా రాయలసీమలో ఫ్యాన్ రెక్కలు విరగటం ఖాయంగా కనిపిస్తోంది.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp