జ‌గ‌న్‌ ఓట‌మే టార్గెట్‌గా చంద్ర‌బాబు మొద‌లు పెట్టిన కొత్త గేమ్ ఇది…!

మ‌హానాడులో తొలిద‌శ మేనిఫెస్టోను ప్ర‌క‌టించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు పెను సంచ‌ల‌నమే సృష్టిం చార‌ని చెప్పాలి. టీడీపీ 41 సంవ‌త్స‌రాల చ‌రిత్ర‌లో మునుపెన్న‌డూ ఇలా ఎన్నిక‌ల‌కు ఏడాది ముందుగానే మేనిఫెస్టో ప్ర‌క‌టించిన చ‌రిత్ర లేదు. తొలిసారి ఇలా.. చంద్ర‌బాబు మేనిఫెస్టోను ముందుగానే అందునా.. ఎన్నిక‌ల‌కు ప‌ది మాసాల ముందుగానే ప్ర‌క‌టించారు. నిజానికి మ‌హానాడులో పాల్గొన్న ఒక‌రిద్ద‌రు సీనియ ర్లు మిన‌హా..ఇంకెవ‌రికీ ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

TDP's Mahanadu 2021 begins, Chandrababu pays tribute to NTR, takes dig at YSRCP govt

తొలిరోజు మ‌హానాడులో చంద్ర‌బాబు మేనిఫెస్టోపై ప్ర‌క‌టించిన‌ త‌ర్వాత కానీ.. అంద‌రూ దీనిపై దృష్టిపెట్ట లేదు. అయితే.. ఇప్పుడు చంద్ర‌బాబు ఇలా ఎందుకు మేనిఫెస్టో ప్ర‌క‌టించార‌నే విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. వైసీపీని ఓడించాలంటే.. చంద్ర‌బాబు కొన్ని విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డిందని మెజారిటీ ప్ర‌జ‌లు భావిస్తున్నారు. నిజానికి ఉచిత ప‌థ‌కాల‌కు తామువ్య‌తిరేకంగా ఉన్నామం టూ.. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకు చెప్పిన ద‌రిమిలా..చంద్ర‌బాబుకూడా దానికి మ‌ద్ద‌తు ఇచ్చారు.

ఉచితాల‌తో రాష్ట్రం అప్పుల పాల‌వుతోంద‌ని కూడా ప‌లువురు టీడీపీ నాయ‌కులు కూడా వ్యాఖ్యానించారు. అలాంటిది అనూహ్యంగా చంద్ర‌బాబు ఇప్పుడు ఉచితాల వైపు మొగ్గు చూపించారు. భారీ ఎత్తున ప‌థ‌కాలు ప్ర‌క‌టించారు. పైగా ఇది తొలి ద‌శ మేనిఫెస్టోనేన‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. అంటే మ‌లివిడ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో మేనిఫెస్టో ఉంటుంద‌నే విష‌యాన్ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు. ఈ మొత్తం ఎపిసో డ్‌లో చంద్ర‌బాబుకు ఉన్న ఏకైక ల‌క్ష్యం స్ప‌ష్టంగా తెలుస్తోంది.

AP: YS Jagan defends replacing NTR's name with YSR's for health varsity - Telangana Today

ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించ‌డం.. వైసీపీకి గ‌ట్టిగా బుద్ధి చెప్ప‌డం అనే రెండు ల‌క్ష్యాల‌నే చంద్ర‌బాబు త‌న దృష్టిలో పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఉచితాల‌కు తాను వ్య‌క్తిగ‌తంగా వ్య‌తిరేక‌మే అయిన‌ప్ప‌టికీ.. రాజ‌కీయంగా చూసుకుంటే..వైసీపీ వంటి పార్టీని ఓడించేందుకు దీనిక‌న్నా.. మ‌రోమార్గం క‌నిపించిన‌ట్టు తెలియ‌డం లేదు. అందుకే ..చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు మ‌ళ్లించుకునేందుకుచాలా వ్యూహాత్మ‌కంగా దీనికి ప్లాన్ చేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.