విడాకుల విష‌యంలో స‌మంత‌నే ఫాలో అవుతోన్న టాలీవుడ్ హీరోయిన్‌..!

సినిమా రంగంలో పెళ్లిళ్లు, ప్రేమలు, కాపురాలు, విడాకులు చాలా మామూలు అయిపోతున్నాయి. అసలు గత నాలుగైదేళ్ళుగా భారతదేశ సినిమా రంగంలో ఎంతోమంది స్టార్ హీరోలు, హీరోయిన్లు బుల్లితెర నటి నటీమణులు చాలా సింపుల్ గా విడాకులు తీసుకుంటున్నారు. వెంటనే మరో ప్రేమలో ప‌డి.. పెళ్లి చేసుకునో కొత్త బంధంలోకి వెళ్లిపోతున్నారు. అసలు పెళ్లి.. విడాకులు అనేవి సినిమా వాళ్లకు చాలా కామన్ అయిపోతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక హీరోయిన్ విడాకుల విషయం ప్రకంపనలు రేపుతుంది.

Samantha Ruth Prabh news: Samantha Ruth Prabhu walks out of Bollywood  films; Is the actor going on long break? Read here - The Economic Times

ఆమె ఓ పార్ట్ టైం హీరోయిన్.. స్టార్ హీరోయిన్ కాకపోయినా తన ఫ్యామిలీ క్రేజ్ వల్ల బాగానే ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇంట్లో వాళ్ళు ఒక పెద్ద సంబంధం కుదిరితే పెళ్లి చేశారు. పెళ్లి జరిగి కూడా రెండేళ్లు అవుతుంది. ఇద్దరి మధ్య ఎక్కడో ? తేడా కొట్టేసింది. దీంతో ఈ హీరోయిన్ భర్తతో ఇప్పటికే విడిపోయిందంటూ ఊహాగానాలు పుంఖానుపుంకాలుగా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కూడా ఆమె ఇండైరెక్టుగా చెప్పకనే చెప్పేస్తుంది.

ఆ పార్ట్ టైం హీరోయిన్ విడాకుల విషయంలో సమంత ఎలా ? అయితే బిహేవ్ చేసిందో ఆమె కూడా అలాగే వెళుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సమంత కూడా విడాకుల పుకార్లు వచ్చినప్పుడు చాలా సైలెంట్ గా ఉంది. ఎప్పుడైతే విడిపోయేందుకు రెడీ అయిందో ? ఒక్కసారిగా స్పీడ్ పెంచేసింది. వరుస‌ ఫోటోషూట్లతో హాట్ హాటుగా కనిపించింది. తన డ్రెస్సింగ్ స్టైల్ మార్చేసింది. కాస్త గ్లామరస్ గా కనిపించే ఫోటోలు పెట్టింది.

ఆ తర్వాత కొద్ది రోజులకు తన ప్రొఫైల్ నేమ్ మార్చేసి.. అక్కినేని ఇంటి పేరును కూడా తొలగించింది. ఆ తర్వాత మెల్లగా నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు ఈ పార్ట్ టైం హీరోయిన్ కూడా మళ్లీ ఫోటోషూట్ లో మొదలుపెట్టింది. గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలయ్యింది. భర్త నుంచి విడిపోతున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇస్తోంది.

తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తన భర్త ఫోటోలు కూడా డిలీట్ చేస్తోంది. భర్త నుంచి దాదాపు విడిపోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయింది. ఇదంతా చూస్తుంటే రేపో మాపో ఆమె తన విడాకులపై అధికారికంగా ప్రకటన చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. విడాకుల విషయంలో అచ్చం సమంత ఏ రూట్లో ? అయితే వెళ్ళిందో ఇప్పుడు ఈ పార్ట్ టైం హీరోయిన్ కూడా అలాగే వెళుతుందని అంటున్నారు.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Samantha, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood gossips, tollywood news, trendy news, viral news