ఆ స్టార్ హీరోను ప్రేమించిన సౌంద‌ర్య‌… వారి ప్రేమ‌ను అర్థం చేసుకున్న హీరో భార్య‌..!

సౌందర్య రెండున్నర దశాబ్దాల క్రితం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. అప్పట్లో స్టార్ హీరోలకు ఎంతమంది అభిమానులు ఉండేవారో.. సౌందర్యకు కూడా అదే స్థాయిలో అభిమానులు ఉండేవారు. ఆ తరం జనరేషన్ మహిళ అభిమానులలో సౌందర్యకు ఎంతో ? మంచి పేరు ఉండేది. కన్నడ అమ్మాయి అయినా తెలుగు ప్రేక్షకులు.. తెలుగు జనాలు ఆమెను తెలుగింటి ఆడపడుచుగా సొంతం చేసుకున్నారు. సౌందర్య కూడా తన సొంత సినిమా ఇండస్ట్రీ కన్నడం కంటే తెలుగు భాషను అమితంగా ప్రేమించేవారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ తనను ఎంతో గౌరవించి తిరుగులేని స్టార్ హీరోయిన్ ను చేసిందని.. తెలుగు సినిమా ఇండస్ట్రీని తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతూ ఉండేవారు. అందుకే ఆమె కన్నడంలో కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాల్లో నటించి ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. తెలుగులో దాదాపు అందరూ స్టార్ హీరోలతోనూ ఆమె నటించారు. 15 సంవత్సరాలపాటు అసలు టాలీవుడ్ లో ఆమెకు తిరుగు లేకుండా పోయింది. స్టార్ హీరోలు సైతం సౌందర్యతో సినిమాలు చేయాలని ఉబలాటపడేవారు.

పైగా వారే దర్శకులు, నిర్మాతలకు సౌందర్యను హీరోయిన్గా తీసుకోమని రికమెండ్ చేసేవారు. అది సౌందర్య టాలెంట్. సౌందర్య ఎంత స్టార్ హీరోయిన్ అయినా ఏనాడు గ్లామర్‌ను నమ్ముకోలేదు.. ఎక్స్పోజింగ్ చేసేందుకు అస్సలు ఇష్టపడేదే కాదు. కేవలం నటన, టాలెంట్ తో మాత్రమే ఆమె అంత గొప్ప హీరోయిన్ అయ్యారు. అయితే సౌందర్య సీనియర్ నటుడు జగపతిబాబు మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. జగపతిబాబు ఎప్పుడూ సౌందర్య యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు హైదరాబాదులో ఆమెకు ఎలాంటి ? సహాయం కావాలన్నా చేసేవారు.

చాలా సార్లు జగపతిబాబు తన సొంత డబ్బులతోనే సౌందర్యకు కావలసిన ఏర్పాట్లు చేసేవారని.. ఆమె ఆ డ‌బ్బులు తిరిగి ఇచ్చేందుకు ట్రై చేసినా జగపతిబాబు అసలు తీసుకునే వారే కాదని ప్రచారం ఉండేది. ఇక వీరిద్దరూ కలిసి సినిమాలలో నటిస్తే తెరమీద కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యేది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య స్నేహానికి మించి ప్రేమ లాంటి వ్యవహారం నడిచిందని కూడా అంటారు.

అయితే ఇది జగపతిబాబు భార్యకు కూడా తెలుసు అని.. అయితే వీరిద్దరి మధ్య గొప్ప స్నేహాన్ని అర్థం చేసుకున్న ఆమె ఏనాడు ఈ విషయంలో ఎలాంటి అపార్థాలకు లోను కాలేదని కూడా ఇండస్ట్రీ జనాలు అప్పట్లో చెవులు కోరుకునేవారు. ఇక సౌందర్య చనిపోయినప్పుడు కూడా జగపతిబాబు మనసు ఎంతో బాధపడింది.. ఆయన ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టిందని కూడా స్వయంగా చాలా సార్లు చెప్పారు.