టాలీవుడ్‌లో అంద‌రు హీరోల‌తో న‌టించిన శ్రీయ‌… ఆ హీరోతో న‌టించ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేంటి ?

చిత్ర పరిశ్రమలో హీరోయిన్ శ్రియా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇష్టం సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తర్వాత టాలీవుడ్‌లోనే తనదైన స్టైల్ స్టార్ డంను దక్కించుకుంది. చిత్ర పరిశ్రమకు వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఉండే అందరి స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్ గా ఓ క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

On Prabhas' birthday, here's a look at five best films of the Baahubali star - Hindustan Times

అంతే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌ అనే బేధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఒకానొక సమయంలో స్టార్ హీరోలు కూడా ఈ అమ్మడి డేట్స్ కోసం వెయిట్ చేసే స్థాయికి వెళ్ళింది. అలాంటి ఈ అందాల భామ చిత్ర పరిశ్రమలో ఉన్న అందరి హీరోలతో కలిసి నటించినా ఒక హీరోయిన్‌తో న‌టించే ఛాన్స్ మాత్రం మిస్ చేసుకుంది. ఆ హీరో కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరో కావ‌డం విశేషం.

Tagore Pics | Tagore Photos | Tagore Portfolio Pics | Tagore Personal Photos - ETimes Photogallery

శ్రీయా ఎందుకు ఆ హీరోతో ? కలిసి నటించలేదు.. ఆ హీరోతో నటించడానికి అవకాశాలు రాలేదా ? వచ్చినా చేయలేదా? అన్న‌ది కూడా ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే ఆ హీరోతో నటించే అవకాశం వచ్చినా శ్రియా కావాలని రిజెక్ట్ చేసింద‌ట‌. దానికి ప్రధాన కారణం ఆ హీరో శ్రియ కన్నా పొట్టిగా ఉండటమే. ఆ హీరో పొట్టిగా ఉన్న కారణంతో తెరపై వీరిద్దరూ కలిసి నటిస్తే అక్క, తమ్ముడిగా కనిపిస్తారని.. ఆ కారణంగానే శ్రియ ఆ హీరో తో కలిసి నటించేందుకు ఇష్ట‌ప‌డ‌లేద‌ట‌.

Shriya to team up with Balakrishna in Ruler?- Cinema express

ఈ రీజన్ తప్పితే ఆ హీరోతో శ్రీయా న‌టించ‌క‌పోవ‌డానికి మరో రీజన్ లేదంటూ.. దర్శక నిర్మాతలకు తన క్లారిటీ ఇచ్చిందట. శ్రియ పేరు మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రస్తుతం పెళ్ల‌య్యి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాక కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఈ ముద్దుగుమ్మ దూసుకుపోతోంది. తనదైన రీతిలో సినిమాలు, వెబ్ సిరీస్ లో నటిస్తూ భారీ ఫాలోయింగ్‌తోనే దూసుకు పోతోంది.

Naa Alludu telugu | Sun NXT