స‌మంత‌కు స‌వ‌తిగా ఆ స్టార్ హీరోయిన్‌…!

స‌మంత‌కు ఓ స్టార్ హీరోయిన్ స‌వ‌తిగా రాబోతోందా ? ఇదేంటి ఇదేం ట్విస్ట్ అని షాక్ అవుతున్నారా ? ఇది నిజ‌మే.. స‌మంత త‌న‌కు పోటీగా ఓ హీరోయిన్‌ను స‌వ‌తిగా తెచ్చుకోబోతోంది. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – స్టార్ హీరోయిన్‌ సమంత కలయికలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా తెర‌కెక్కుతోంది. సెప్టెంబ‌ర్ 1న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే డేట్ కూడా ప్ర‌క‌టించారు.

Vijay Deverakonda and Samantha's 'Kushi' movie release date has been announced - Telangana Today

ఈ సినిమాలో స‌మంత మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తోంద‌న్న విష‌యం మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న‌కు తెలుసు. అయితే ఇప్పుడు మ‌రో స్టార్ హీరోయిన్ కూడా న‌టించ‌బోతోంద‌ట‌. ఈ విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ స్టార్ హీరోయిన్ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ల‌వ‌ర్ పాత్ర‌లో న‌టించ‌బోతోంద‌ట‌. సినిమా సెకండాఫ్‌లో ఈ పాత్ర వ‌స్తుంద‌ని తెలుస్తోంది.

Kushi's first single Na Rojaa Nuvve to release on May 9 | The Pioneer

ఈ పాత్ర‌లో ఏ హీరోయిన్ న‌టిస్తుంద‌న్న‌ది మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌కుండా మేక‌ర్స్ స‌స్పెన్స్‌లో ఉంచారు. రెండో స్టార్ హీరోయిన్ పాత్ర ఉండ‌డంతో విజ‌య్ – స‌మంత మ‌ధ్య‌లో ఆమె పాత్ర ఎలా ఉండ‌బోతోంద‌న్న ఉత్కంఠ అయితే ఉంది. ఈ సినిమా క‌థ ఓ మెచ్యూర్డ్ ల‌వ్ స్టోరీలా ఉంటుంద‌ని అంటున్నారు.

Kushi song Na Roja Nuvve starring Vijay Deverakonda, Samantha Ruth Prabhu out

శివ నిర్వాణ సినిమా అంటేనే చాలా హుందాగా ప్రేమ‌క‌థ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉంటుంది. ఆయ‌న గ‌త సినిమాలు మజిలీ, నిన్ను కోరి అయితే హార్ట్ ట‌చ్చింగ్‌గా ఉంటాయి. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా కూడా అదే స్టైల్లో ఉండబోతోందంటున్నారు.