మహేష్ తో రాజమౌళి సినిమా ఇప్పట్లో లేనట్టే ?

2023 జనవరి నుంచి రాజమౌళి మహేష్ బాబుతో సినిమా ప్రారంభించబోతున్నాడని.. అప్పటికి RRR రిలీజ్ అయ్యి 10 నెలలు అవుతుందని ఫీలర్స్ రావడంతో రాజమౌళికి సరిపడా సమయం దొరికింది.రాజమౌళి సెట్స్‌కి వెళ్లే ముందు హీరో లుక్, మేకోవర్, డిస్కషన్స్ మరియు ప్రీ-ప్రొడక్షన్‌ల కోసం కావాల్సిన సమయం తీసుకుంటాడు.అందుకే జనవరి నుంచి మహేష్ బాబు అందుబాటులో ఉండాలని రాజమౌళి కోరారు.కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మహేష్ బాబుకు మార్చి-ఏప్రిల్ వరకు సమయం దొరకడం లేదు.

త్రివిక్రమ్ ఇంకా మహేష్ తో సినిమా మొదలు పెట్టలేదు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచి షూటింగ్ ప్రారంభం కావాలి.అయితే ఇప్పుడు నిర్మాతల సమ్మె మాత్రం కొనసాగుతోంది. ఈ నెల 10వ తేదీలోగా సమ్మె విరమించే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు.ప్రొడ్యూసర్స్ గిల్డ్ కూడా వీలైనంత త్వరగా సమ్మెను విరమింపజేసే దిశగా కసరత్తు చేస్తోంది, వివిధ విభాగాలతో నిరంతర సమావేశాలు నిర్వహిస్తోంది.కానీ వాళ్ళు ఫిలిం ఛాంబర్ ఒప్పందాలకు ఆమోదం తెలపాలని, అప్పుడే సమ్మె విరమించే అవకాశం ఉందన్నారు. కావున ఇది చాల సమయం పట్టవచ్చు .

మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా పూర్తి చేయడానికి కనీసం 6-7 నెలల సమయం కావాలి. కాబట్టి అంతా సవ్యంగా సాగితే 2023 వేసవి నుంచి మాత్రమే మహేష్ రాజమౌళికి అందుబాటులో ఉండగలడు.దీనితో అభిమానులు కోరిక తీరాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే .

Tags: MaheshBabu, SS Rajamouli, tollywood news