సూపర్ స్టార్ కి బెస్ట్ విషెస్ చెప్పిన పవర్ స్టార్..!

అప్పటి తరం స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల తర్వాత ఇప్పటి తరం హీరోలు ఎన్టీఆర్, బన్నీ, చరణ్, ప్రభాస్ ల కన్న ముందు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు. వీరిద్దరూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత స్టార్ స్టేటస్ అందుకోవడానికి పెద్ద సమయం తీసుకోలేదు. ఇంచు మించు ఇద్దరూ ఒకేసారి స్టార్ హీరోలు అయ్యారు. ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్, చరణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే పవన్, మహేష్ స్టార్ హీరోలుగా ఓ రేంజ్ కి వెళ్లారు.

పవన్, మహేష్ తమ కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో సన్నిహితంగా మెలిగేవారు. మహేష్ హీరోగా నటించిన అర్జున్ సినిమా పైరసీ బారిన పడిన సమయంలో మహేష్ చేస్తున్న పోరాటానికి పవన్ మద్దతు ఇచ్చాడు. ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇవాళ తన సమాకాలికుడు మహేష్ బర్త్ డే కావడంతో పవన్ కళ్యాణ్ మహేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.

‘ మహేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మహేష్ తనదైన శైలిలో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గుండె జబ్బుతో బాధ పడే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించడం అభినందనీయం. మహేష్ బాబు గారు మరిన్ని విజయాలు అందుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను’ అని పవన్ ట్వీట్ చేశారు. మహేష్ జన్మదినం సందర్భంగా పవన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యింది. మహేష్ కి చిరంజీవి, చరణ్, ఎన్టీఆర్, అది సాయి కుమార్, వైష్ణవ్ తేజ్ తదితర సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

Tags: MaheshBabu, maheshbabu . maheshbabu birthday, Pawan kalyan