రాజ‌మౌళి సినిమా కోసం మ‌హేష్‌కు షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌… ఆ ఫిగ‌ర్ చూస్తేనే క‌ళ్లు జిగేల్‌..!

తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో మహేష్- రాజమౌళి కాంబోలో వ‌చ్చే సినిమా ఒకటి. ఈ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన రాకపోయినా.. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్లు ఇవ్వకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాపై భారీ రేంజ్‌లో పబ్లిసిటీ జరుగుతోంది. త్రిబుల్ ఆర్ త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Mahesh Babu helps a young child | cinejosh.com

గ్లోబల్ ప్రాజెక్టుగా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఇప్పటివరకు ఎవరు ఊహించ‌ని లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు మనం మహేష్ బాబును మహా అయితే క్లాస్.. మాస్ లుక్ లో మాత్రమే చూశాము.. ఇప్పుడు రాజమౌళి సినిమాలో మాత్రం ఓ డిఫరెంట్ యాక్షన్ జోనర్లో మహేష్‌ను చూడ‌బోతున్నాం. దీనిపై అయితే ప‌క్కా క్లారిటీ వ‌చ్చేసింది.

ఈ సినిమా షూటింగ్ మొత్తం అడవుల్లోనే జరుగుతోంది. దానికోసం మహేష్ ఇప్ప‌కు ఓ సపరేట్ డైట్ కూడా ఫాలో అవుతున్నారు. ఇలాంటి సమయంలోనే మహేష్- రాజమౌళి సినిమా కోసం ఏకంగా రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడంటూ ఓ న్యూస్ ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటివరకు మహేష్ ఒక్కటంటే ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు.

Rajamouli Was Never So Confidential | cinejosh.com

అయినా ఆయన పాపులారిటీ, క్రేజ్ పరంగా చూసుకుంటే పాన్ ఇండియా హీరోలకి మహేష్ తక్కువేమీ కాదు. ఈ సినిమా కోసం మ‌నోడు రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడ‌న్న‌ న్యూస్ ఓ రేంజ్‌లో వైరల్ గా మారింది. ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మహేష్ కెరియర్ లోనే ఇది ఓ అరుదైన రికార్డే అవుతుంది. మ‌నోడి క్రేజ్ గ్లోబ‌ల్ వైడ్‌గా ఎలా ? ఉందో చెప్పేందుకు ఇది నిద‌ర్శ‌నం.