జ‌న‌సేన రాపాక స్క్రిఫ్ట్ పూర్తిగా రివ‌ర్స్‌… ఇంత దెబ్బ ప‌డిపోయిందే…!

రాజకీయాల్లో చాలామంది నేతలు పెద్దగా విలువలు పాటించడం లేదనే చెప్పాలి..సొంత ప్రయోజనాలు తప్ప..విలువలు విశ్వసనీయత లాంటివి పెద్దగా పట్టించుకోరు. కానీ అవేం పట్టించుకోకపోయినా కొందరు నేతలు పైకి మాత్రం ఎదుటవారి మాత్రం బురదజల్లడానికి చూస్తారు. అలా చేస్తే..ప్రజలు నమ్మరని గట్టిగా చెప్పవచ్చు. ముందు ఏ నాయకుడైన కరెక్ట్ గా ఉంటూ..ఎదుటవారిపై ఆరోపణలు చేస్తే నమ్ముతారు.

Jana Sena MLA Rapaka Varaprasad justifies three capitals, says all regions  will develop

అయితే వైసీపీలో ఇప్పుడు రాపాక వరప్రసాద్ పరిస్తితి కూడా అలాగే ఉంది..ఆయన కరెక్ట్ గా ఉన్నారంటే..అదీ లేదు. ఆయన గత ఎన్నికల్లో గెలిచింది జనసేన నుంచి..ఆ పార్టీ నుంచి గెలిచి పవన్‌కు హ్యాండ్ ఇచ్చేసి వైసీపీలోకి వెళ్లారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారు. అలా పార్టీ మారిన రాపాక.. ఇప్పుడు టి‌డి‌పిపై ఆరోపణలు చేయడం విచిత్రం.

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పికి క్రాస్ ఓటింగ్ చేయాలని రాపాకకు టి‌డి‌పి పది కోట్ల ఆఫర్ ఇచ్చిందట.. దాన్ని ఆయన తిరస్కరించారట. అంటే ఏదైనా చెబితే నమ్మేలా ఉండాలి. మరి గుడ్డిగా ఏది పడితే అది చెబితే జనాలు నమ్ముతారని అనుకోవడం రాపాకకే చెల్లింది. ఎందుకంటే ఆయనే పార్టీ మారి, అధికార పార్టీలోకి వెళ్ళి..అక్కడ వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా లబ్ది పొందుతున్నారో రాజోలు ప్రజలకు బాగా తెలుసు.

Rapaka Vara Prasad: AP Assembly elections 2024లో YSRCP నుంచి పోటీ చేస్తానని  ప్రకటించిన Jana Sena MLA - Telugu Oneindia

అలాంటి ఆయన మళ్ళీ టి‌డి‌పిపై ఆరోపణలు చేయడం విచిత్రంగానే ఉన్నాయి. ఈయనే కాదు తమ ఎమ్మెల్యేలని కొనుగోలు చేశారని వైసీపీ చేసే ఆరోపణల్లో కూడా పస లేదు. టి‌డి‌పికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలని లాక్కుని, ఇప్పుడు ఇలాంటివి చేస్తే జనం నమ్మడం కష్టమే. మరి రాపాకకు కూడా అదే స్క్రిప్ట్ ఇచ్చారు..దీంతో సీన్ రివర్స్ అయింది.

ఇక ఈయన సొంత నియోజకవర్గంలోనే గెలిచే పరిస్తితి కనిపించడం లేదు. ఇటీవల సర్వేల్లో రాజోలులో జనసేన గెలవడం ఖాయమని తేలింది. ఇక టి‌డి‌పి-జనసేన కలిస్తే..రాపాక పరిస్తితి ఏంటి అనేది ఊహకు అందని విధంగా ఉంది.

Tags: AP, ap politics, intresting news, janasena, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp