జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కుడే ఇంత కొంప ముంచేసిందా…!

ఏపీ ప్రజల్లో మార్పు వచ్చిందని, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం జ‌రిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను లైట్ తీసుకుంటే.. పార్టీ ప‌రంగా వైసీపీ మ‌రింత న‌ష్ట‌పోవ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు మార్చాలనుకుంటున్నారనే సంకేతాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు.

పోలీసులతో టీడీపీ నేతలు, కార్యకర్తలను భయపెట్టార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తినా.. ఎన్నిక‌ల్లో మాత్రం ప్ర‌జ లు (గ్రాడ్యుయేట్లు) టీడీపీ అభ్య‌ర్థుల ప‌క్షానే నిలిచార‌ని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం బ‌ట‌న్ నొక్కుళ్లు త‌ప్ప‌.. ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదనే వాదన తాజా ఫ‌లితాల‌తో స్ప‌ష్టంగా తెలుస్తోందని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అభివృద్ధి అనేదే లేద‌ని ప్ర‌తి ఒక్క‌రు ముందు నుంచి చెపుతున్నా జ‌గ‌న్ మాత్రం త‌న పంథాలోనే ముందుకు వెళుతున్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, ప్రభుత్వం ఒక్కటి ఇచ్చిన పాపాన పోలేదని ఆరోపిస్తున్నారు. అదేస‌మ యంలో వలంటీర్ వ్య‌వ‌స్థ కూడా.. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌తోనే నింపేశార‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నా రు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో రావడంలేదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే అంచ‌నాల‌ను కొట్టి పారేయ‌లేమ‌ని మెజారిటీ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఆ పార్టీ మ‌రింత‌గా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది కూడా రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌.

ఏదేమైనా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు కొన‌సాగితే.. మున్ముందు వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొనక త‌ప్ప‌ద‌ని మెజారిటీ రాజ‌కీయ ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రింత దూకుడు పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు వాస్త‌వానికి ఈ ఎన్నిక‌ల‌ను సెమీఫైన‌ల్‌గా పేర్కొన్న ప్ర‌భుత్వం.. ఇప్పుడు దాని నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని విమ‌ర్శిస్తున్నారు. మొత్తానికి ప్ర‌భుత్వంపై ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను నిద‌ర్శ‌న‌మేన‌ని చెబుతున్నారు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp