తీన్‌మార్ ‘ సినిమా ఫ్లాప్‌న‌కు అదే కారణమా.. ఇన్నాళ్ల‌కు బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ రీజ‌న్‌…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ తన కెరీర్ లో కొన్ని ఫ్లాప్ సినిమాలు చూడాల్సి వచ్చింది. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ… మేనరిజంతో ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప‌వ‌న్ న‌టించిన‌ తీన్మార్ ఆయన కెరియర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

ఈ సినిమాకు టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ జయంత్ దర్శకత్వం వహించారు. జయంత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను దర్శకత్వ వహించిన సినిమాల గురించి మాట్లాడాడు. ఈ క్రమంలోనే తీన్మార్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. నాకు తెలిసినంతవరకు పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ కి… ఈ సినిమా సరిపోలేదని కొంతమంది ఫ్యాన్స్ నిరాశపడ్డారట.

ఇందులో ముఖ్యంగా త్రిష‌కు సోనుసూద్ తో వివాహం చేయడం.. ఆ తర్వాత ఆమె తిరిగి పవన్ కళ్యాణ్ వద్దకు రావడం లాంటి సీన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి న‌చ్చ‌లేద‌ట‌. ఇదే తిన్మార్ ఫ్లాప్ కి పెద్ద కార‌ణం అని చెప్పాడు. ఒక‌ వేళ ఇదే సినిమా ఎవరైనా యంగ్ హీరో తో తెరకెక్కించి ఉంటే కచ్చితంగా రిజల్ట్ వేరేలా ఉండేద‌ని చెప్పారు.

తీన్‌మార్‌ మ్యూజిక్ పరంగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా సాయి ధరమ్ తేజ్ కలిసి బ్రో అనే మల్టీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజై ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ఓజీ, వీర‌మ‌ల్లు, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.