నాని ద‌స‌రా ‘ ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ భార్య ఎవ‌రో తెలుసా…!

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన దసరా సినిమాతో తొలి ప్రయత్నం లోనే దర్శకుడుగా సక్సెస్ అయ్యారు శ్రీకాంత్ ఓదెల‌. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ దసరా విజయోత్సవం లో తన బ్యాచిలర్ లైఫ్‌కి పులిస్టాప్ పెట్టేశాడు.. దాంపత్య జీవితం ప్రారంభించాడు. సౌమ్యకృష్ణతో శ్రీకాంత్ కు బుధవారం పెళ్లి జరిగింది. అతి కొద్ది మంది బంధువులు, సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వివాహానికి గోదావరిఖని వేదిక అయింది.

వాస్తవానికి ఈ పెళ్లికి దసరా హీరో నాని హాజరు కావాల్సి ఉంది. నాని షూటింగ్ నిమిత్తం ఇతర రాష్ట్రాలలో ఉండడంతో హాజరు కాలేకపోయాడు. అయితే ఈ పెళ్లి వేడుక ఫోటోని నాని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మన శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడు.. మీ ఆశీస్సులు పంపండి అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. దీంతో సోషల్ మీడియాలో నూతన దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక శ్రీకాంత్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ కు శిష్యుడు.

సుకుమార్ దగ్గర నాన్నకు ప్రేమతో – రంగస్థలం సినిమాలకు పనిచేసి ఆ తర్వాత దసరా సినిమాతో దర్శకుడుగా మారాడు. నాని, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన దసరా సినిమా రు. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నాని కెరీర్లు బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ ఏడాది మార్చి 30న దసరా థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్ అయింది.

ఇక శ్రీకాంత్ పెళ్లి చేసుకున్న సౌమ్యకృష్ణ ఎవరో ? కాదు.. మనోడికి చిన్ననాటి స్నేహితురాలు. వీరిద్దరూ కలిసి చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఉండేవారు. ఇక సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యాక శ్రీకాంత్ ఇప్పుడు సౌమ్యకృష్ణను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నారు.