ద‌స‌రా ‘ కు తొలి రోజే పెద్ద దెబ్బ‌… నాని చేసిన బ్లండ‌ర్ మిస్టేక్‌తో భారీ న‌ష్టం…!

నేచురల్ స్టార్ నాని తన కెరీర్లో మొదటిసారిగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా దసరా. తెలంగాణ కుర్రాడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని మొట్టమొదటిసారిగా ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. నానికి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పక్కా లోకల్ సూపర్ హిట్ అవడంతో ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్, టీజర్. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి అభిమానులని ప్రేక్షకులను సినిమా కోసం ఎదురు చూసేలా చేశాయి. ఇక పాటలు అయితే సూపర్ హిట్ అయ్యి రిపీటెడ్ గా వినిపిస్తున్నాయి. నాని కెరియర్ లోనే మొదటిసారి ఏకంగా రు. 70 కోట్ల భారీ బడ్జెట్లో తెర‌కెక్కిన దసరా సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. నాని కూడా సినిమాపై నమ్మకంతో కొద్దిరోజులుగా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు. నాని గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ బాగున్నా… సినిమాపై ఉన్న హైప్‌తో పోలిస్తే కాస్త త‌క్కువుగా ఉన్నాయంటున్నారు.
‘ ద‌స‌రా ‘ టాక్ అరాచ‌కం… ఆ ఒక్క కంప్లైంట్ లేక‌పోతే కేజీయ‌ఫ్ రేంజ్ హిట్ట‌య్యేది…!

అయితే నిర్మాతలు చేశారో లేదా డిస్ట్రిబ్యూటర్లు చేశారో కానీ చిన్న మిస్టేక్ వల్ల ఇప్పుడు సినిమాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. కనీసం నాని అయిన ఈ మిస్టేక్ ను సరిచేసి ఉండాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కొన్ని సినిమాల‌కు టికెట్ రేట్ ఏకంగా రూ. 295 ఆ పైన పెట్టడంతో చాలా మంది ప్రేక్ష‌కులు సినిమాలు చూసేందుకు ఇష్టపడలేదు. కంటెంట్ బాగున్నా అంతంత రేట్లు పెట్టి టికెట్ కొని థియేటర్లోకి వెళ్లి చూసేందుకు ప్రేక్షకులు కదల్లేదు. దీంతో సినిమాలు బాగున్న కలెక్షన్లు రాలేదు.

నాని ‘ ద‌స‌రా ‘ రివ్యూ…. పాన్ ఇండియా లెవ‌ల్లో పూన‌కాలు
నాని గత రెండు, మూడు సినిమాల విషయంలోనూ అదే జరిగింది. సినిమాకు మంచి టాక్ వచ్చిన వసూళ్లు రాలేదు. ఇప్పుడు దసరా విషయంలోనూ అదే రిపీట్ అయ్యేలా ఉంది. మల్టీప్లెక్స్ లో అయితే ఏకంగా రూ. 295 రేట్గా ఫిక్స్ చేశారు. అదే రిక్ల‌యిన‌ర్లు అయితే ఏకంగా రూ. 350 పెట్టారు మరి ఇంత రేటు పెట్టి సినిమాలు చూడటం కంటే రేపు ఓటీటీ లో రిలీజ్ అయ్యాక చూద్దాం అన్న ధోరణి ప్రేక్షకుల్లో వస్తే దసరా సినిమాకు పెద్ద షాక్ తగిలినట్టే. తొలి రోజు చాలా చోట్ల బుకింగ్స్ తక్కువగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు.