బాల‌య్య‌తో ఆ ఓటీటీ క‌ళ్లు చెదిరే డీల్‌… వెబ్‌సీరిస్‌లోనూ న‌ట‌సింహం…!

ప్రస్తుతం నందమూరి నటసింహం అటు వెండితెర మీద ఇటు బుల్లితెర మీద ఊహించని సంచలనాలు క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నారు. అసలు గత రెండేళ్లుగా బాలయ్య పట్టిందల్లా బంగారమే అవుతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో కరోనా టైంలో అఖండ సినిమాతో థియేటర్లో లోకి దిగి టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేసి పడేశారు. అఖండ బాక్సాఫీస్ దగ్గర నిజంగానే అఖండ గర్జన మోగించేసింది. అఘోరగా బాలయ్య నట విశ్వరూపానికి థియేటర్లు బెంబేలెత్తిపోయాయి.

Balayya makes a roaring impression with Unstoppable promo - TrackTollywood

ఇక ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి గా మరోసారి బాక్సాఫీస్ దగ్గర విజయం విజృంభించాడు. అటు ఆహా ఓటీపీ ప్లాట్‌ఫాంలో అనుస్టాప‌బుల్ సీజన్ 1, సీజన్ 2 లో కూడా బాలయ్య సింగిల్ హ్యాండ్ తో సక్సెస్ చేసేసారు. సెలబ్రిటీల నుంచి ఎన్నో సరికొత్త విషయాలు ఈ ప్రపంచానికి తెలియజేశారు. ఇప్పుడు ఆహాలోనే తాజాగా వస్తున్న డ్యాన్స్ షోకు సైతం గెస్ట్‌గా వస్తున్న సంగతి తెలిసిందే.

THE FIRST LOOK: NBK UNSTOPPABLE WITH PAWAN KALYAN - Filmybowl Best Telugu  Film News, Telugu Film Updates, Film News Updates, Tollywood News Updates

ఆహా లో బాలయ్య చేసిన సెన్సేషనల్ టాక్ షో అదిరిపోవడంతో ఇప్పుడు మరో ప్రముఖ ఓటీటీ సంస్థ బాలయ్యతో ఏకంగా ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కూడా భారీ లెవెల్ హంగులతో ప్లాన్ చేస్తున్నారట. ఈ డీల్ ఓకే అయితే బాలయ్య నుంచి మనం మరో పవర్ఫుల్ వెబ్ సిరీస్ కూడా చూసినట్టు అవుతుంది. అయితే ఆ ఓటీపీ సంస్థ ఏది? ఎప్పటినుంచి ఈ సీరిస్ స్టార్ట్ అవుతుంది బాలయ్య ఈ డీల్ కు ఓకే చెప్తారా లేదా అన్నది.. త్వరలోనే క్లారిటీ రానుంది.

Tags: balakrishna, film news, filmy updates, intresting news, latest news, latest viral news, NBK, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood gossips, tollywood news, trendy news, viral news