వైసిపికి మ‌రో సీనియ‌ర్ ఎమ్మెల్యే గుడ్ బై.. మ‌ళ్లీ రెడ్డి గారే దెబ్బ కొడుతున్నారా…!

ఏపీలో అధికార వైసిపికి వరుస పెట్టి షాకులు తగులుతున్నాయి. తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ముడుచోట్ల వైసిపి ఓడిపోయింది. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో బలం ఉండి కూడా ఒక సీటులో ఓడిపోవలసి వచ్చింది. అధికార వైసిపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడిపికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు. ఈ క్రమంలోనే అనుమానితులుగా ఉన్న నలుగురు తమ పార్టీ ఎమ్మెల్యేలను వైసిపి సస్పెండ్ చేసింది. ఈ నలుగురిలో ముగ్గురు ఏకంగా నెల్లూరు జిల్లాకు చెందిన రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలే ఉన్నారు.

Nallapareddy Prasanna Kumar Reddy makes his entry into AP assembly for the  sixth time

2014, 2019 ఎన్నికలలో నెల్లూరు జిల్లాలో వైసిపి తిరుగులేని ఘనవిజయాలు నమోదు చేసింది, 2019 ఎన్నికలలో పదికి పది అసెంబ్లీ సీట్లతో పాటు నెల్లూరు ఎంపీ సీటును కూడా భారీ మెజార్టీతో గెలుచుకుంది. నెల్లూరు అంటేనే వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోట. 2014 సాధారణ ఎన్నికలకు ముందే కొవ్వూరు, ఉదయగిరి అసెంబ్లీ సీట్లతో పాటు నెల్లూరు లోక్ స‌భ‌ సీట్లు జరిగిన ఉప ఎన్నికలలోను వైసిపి అప్రతిహత విజయాలు నమోదుచేసింది.

దీనిని బట్టి నెల్లూరు వైసిపికి ఎంత బలంగా ఉందో తెలుస్తోంది. అలాంటి చోటే ఇప్పుడు అసమతి కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సీనియర్ ఎమ్మెల్యే పేరు కూడా వీరి జాబితాలో వినపడుతోంది. తన తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి నుంచి రాజకీయవారసత్వం అందుకున్నారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయన టీడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సమీప బంధువు.

మంచమే పట్టదు.. కొత్త జంటలకు కాపురం కూడా కష్టమే: జగనన్న ఇళ్లపై నల్లపురెడ్డి  వ్యాఖ్యలు | ysrcp mla nallapareddy prasanna kumar reddy sensational  comments on jagananna illu ksp

వీరిద్ద‌రూ వరుసకు బావ, బావమరుదులు అవుతారు. జగన్ కోసం టీడిపి నుంచి వచ్చిన ప్రసన్నకుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవి వదులుకుని ఉప ఎన్నికలకు వెళ్లి మరి గెలిచారు. సీనియర్ నేతగా ఉన్న ఆయనకు పార్టీలో ప్రాధాన్యత లేదు. మంత్రి పదవి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రెండుసార్లు కూడా మంత్రి పదవి రాకపోవడంతో ఆయన ఒక్కోసారి ఫ్రస్టేషన్ కు గురవుతూ తన అసంతృప్తిని వినిపిస్తున్నారు.

పార్టీలో కనీస గౌరవం గుర్తింపులేని చోట ఎందుకు ? కొనసాగాలని ఆయన తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆయన తెలుగుదేశం మూలాలు ఉన్న నేత. ఆయన తండ్రి శ్రీనివాసులు రెడ్డి కూడా టీడిపిలో ఒకప్పుడు చక్రం తిప్పారు. ఈ క్రమంలోనే ఆయన తిరిగి టీడిపిలోకి వెళతారని అంటున్నారు. ప్రస్తుతానికి ప్రసన్ కుమార్ రెడ్డి వేచిచూసే ధోరణితో ఉన్నట్టు తెలుస్తోంది. రేపటి రోజున ఏం జరుగుతుందో ? అన్న ఉత్కంఠ అయితే కోవూరులో కనిపిస్తుంది.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp