‘ అంబ‌టి రాయుడు ‘ అన్ని కోట్ల‌కు అధిప‌తా… ల‌గ్జ‌రీ లైఫ్ చూస్తే క‌ళ్లు కుట్టాల్సిందే…

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికేశాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు తాజాగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తో ఐపీఎల్ కి కూడా గుడ్ బై చెప్పేసాడు. ఫైనల్ మ్యాచ్లో కేవలం ఎనిమిది బంతుల్లోనే రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి తన టీం గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇక క్రికెట్ కి గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ? అన్నది కూడా ఆసక్తిగా ఉంది.

ఇదిలా ఉంటే అసలు అంబటి రాయుడు ఇన్నేళ్ల తన కెరీర్లో ఎంత ఆస్తి సంపాదించుకున్నాడు ? అతడి లైఫ్ ఎలా ఉంది ? అన్నదానిపై కూడా ఆసక్తికర చర్చలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. అభిమానులు ముద్దుగా రాయుడు అని పిలుచుకునే ఈ ఆల్రౌండర్ తన అత్యుత్తమ ప్రదర్శనతో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. భారత క్రికెట్ జట్టులో మిడిల్ ఆర్డర్లో రైట్ హ్యాండ్ బ్యాటర్ గా, రైట్ ఆర్మ్ బౌల‌ర్‌గా జ‌ట్టుల‌కి వ‌చ్చాడు.

టాప్ బ్రాండ్ వ్యాల్యూ కారణంగా కొంతకాలంగా అంబటి రాయుడు నికర ఆస్తులు విలువ 40 శాతం పెరిగిందట. అలాగే రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో కూడా ఆదాయం డబుల్ అయినట్టు తెలుస్తోంది. ఇక రాయుడు వ్యవసాయం చేసుకుంటూ ఫామ్ హౌస్ లో గడుపుతానని చెప్పినా… ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తాడని.. అటు బిజినెస్ లు కూడా చేస్తాడని చెబుతున్నారు.

ఇక అంబటి రాయుడు కార్ల కలెక్షన్ చాలా చిన్నది. ఆడికారుతో పాటు ప్రపంచంలోని ది బెస్ట్ లగ్జరీ కార్లు కొన్ని మాత్రమే అతడి దగ్గర ఉన్నాయట. అంబటి రాయుడు 1985 సెప్టెంబర్ 23న గుంటూరులో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. 1992లో మూడో తరగతి చదువుతున్నప్పుడే రాయుడిని తండ్రి హైదరాబాదులో విజయ్ పాల్‌ క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. ఇక 2009లో రాయుడు తన స్నేహితురాలు విద్యను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.