అఖిల్ ‘ ఏజెంట్ ‘ రివ్యూ… సినిమా మొత్తం మీద‌ ఒక్క మంచి సీన్ కూడా దొర‌క‌ట్లేదా…!

అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 8 సంవత్సరాలవుతుంది. ఈ 8 సంవత్సరాలలో అఖిల్ చేసిన సినిమాలు ఏవీ ఆకట్టుకోలేదు. ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రమే యావరేజ్ మార్కులు వేయించుకుంది. అయితే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా రెండున్నర సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎట్టకేలకు ఎన్నో అవాంతరాలు దాటుకుని ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖిల్ కెరీర్ లోనే అత్యధికంగా రు. 80 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో కొత్త అమ్మాయి సాక్షి వైద్య హీరోయిన్గా నటించింది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియ‌ర్లు కంప్లీట్ చేసుకున్న ఏజెంట్ సినిమాకు అతి దారుణంగా డిజాస్టర్ టాక్ వస్తోంది. అఖిల్ తొలి సినిమా అఖిల్‌ను మించి మరి ఏజెంట్ కు దారుణమైన నెగటివ్ టాక్ వస్తోంది. సినిమా పేరుకు మాత్రమే భారీ బ‌డ్జెట్ అని… చివరకు ఫ్యాన్స్ కు కూడా ఈ సినిమా నచ్చేలా లేదని తెలుస్తోంది.

సినిమా చూసిన అక్కినేని వీరాభిమానులు, అఖిల్ అభిమానులు అయితే కనీసం సినిమా బాగుందని కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఏజెంట్ ఆపరేషన్ మిస్‌ఫైర్‌ అయిందని చెబుతున్నారు. సినిమాలో ప్రొడక్షన్, ఫైట్లు తప్ప అసలు ఇంకా ఏమీ బాగోలేదని… అఖిల్‌ వరకు యాక్షన్ పరంగా మెప్పించేందుకు ప్రయత్నించాడని.. నటనతో మాత్రం ఆకట్టుకోలేకపోయాడని అంటున్నారు.

కొందరు ఫస్టాఫ్ బాగుంది… సెకండ్ హాఫ్ దారుణంగా ఉందని చెబుతుంటే, మరికొందరు ఫస్ట్ ఆఫ్ సెకండ్ ఆఫ్ రెండు దారుణంగా ఉన్నాయని అంటున్నారు. సినిమాలో వీఎఫ్ఎక్స్‌ ఎలాంటి క్వాలిటీ లేదని.. క్లైమాక్స్ కూడా చాలా సిల్లీగా ఉందని.. అసలు క‌థ‌, కథనాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్తున్నారు. ఫ‌స్టాప్ మొత్తం మీద ఇంటర్వెల్ కి ముందు వార్నింగ్‌ ఇచ్చే సీను తప్ప ఏదీ లేదని అంటున్నారు. ఇక పాటలు, నేపథ్య సంగీతం పెద్ద మైనస్ అని తెలుస్తోంది.

కనీసం హీరోయిన్ లిప్‌సింక్ కూడా మ్యాచ్ కాలేదని.. ఆయన పాత్రకు సంబంధించి సురేందర్ రెడ్డి పరమ బోరింగ్ సీన్లు రాసుకున్నాడని చెబుతున్నారు. అసలు కామెడీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని.. సినిమాకు కీలకమైన సెకండాఫ్‌లో బలమైన కథ‌లేదని ఆ విషయంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని అంటున్నారు. సెకండ్ హాఫ్ అనేక మలుపులు తిరుగుతూ ఆడియన్స్‌ను అలిసిపోయేలా చేస్తుందని టాక్. అఖిల్, ముమ్ముట్టి లాంటి ఎట్రాక్షన్ ఉన్న నటులు ఉన్నా కథలో దమ్ము లేకపోవడం.. కథనం నీరసంగా ఉండటం.. లాజిక్‌లెస్‌ సీన్లు, క్లైమాక్స్ దారుణంగా ఉండటం సినిమాని డిజాస్టర్ ను చేసిందని చెబుతున్నారు.

ఏది ఏమైనా ఈ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలని అఖిల్ ఎంతో ఆశపడ్డాడు. అఖిల్ కోరిక ఏమాత్రం తీరద‌ని అఖిల్ తొలి సినిమా అఖిల్ ను మించిన డిజాస్టర్ కచ్చితంగా ఏజెంట్ అవుతుందన్న టాక్ బలంగా వచ్చేసింది. అఖిల్‌కు బెస్ట్ ఆఫ్ లక్ నెక్స్ట్ మూవీ అంటున్నారు. చివరకు ఫ్యాన్స్ కూడా ఏజెంట్ సినిమా బాగుందని చెప్పే సాహసం చేయట్లేదు అంటే.. ఈ సినిమాకు యూఎస్ నుంచి ఎంత నెగిటివ్ టాక్ వచ్చిందో అర్థమవుతుంది.