దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ అనగానే గుర్తుకు వచ్చేది నయనతార. 75 సినిమాలకు పైగా నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయన్ టాలీవుడ్‌లో అగ్ర హీరోల అందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాక కన్నడ , మలయాళ భాషల్లో కూడా నటిస్తూ బహుభాషా నటిగా పేరు సంపాదించుకుంది.
ఇన్నేళ్లకు కూడా నయన్ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూనే ఉంది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్స్ లో నయన్ ఒకటి. ఇప్పుడు ఆమె జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. నయన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి దాదాపు రూ.8 నుంచి రూ.10 కోట్ల చార్జ్ చేస్తుందట. జవాన్ సినిమాకు కూడా భారీగా రెమ్యునరేషన్ పుచ్చుకుందట. ఇలా సినిమాల ద్వారా నయనతార సంపాదించిన ఆస్తులు విలువ తెలిస్తే నోరెళ్ళ పెట్టాల్సిందే.
నయనతార దాదాపు రూ.300 కోట్ల స్థిర, చర ఆస్తులను సంపాదించిందట. ఆదాయపు శాఖకు నయన్ దాఖలు చేసిన లెక్కల వివరాల ప్రకారం ఈ సమాచారం అందుతోంది. ఇక చెన్నైలో లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన ఒక ఖరీదైన ఇల్లు ఉంది. ఆమెకు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోజికోడ్ లాంటి చోట్ల ఇళ్లు, విల్లాలు ఉన్నాయి. కేరళలోని కొచ్చిన్‌ల తల్లిదండ్రుల కోసం మరో ఇల్లు కట్టుకుంది.
నయన్ బంజారాహిల్స్‌లో రూ.20 కోట్ల విలువ చేస్తే అత్యంత విలువైన ప్లాట్ కొనుగోలు చేసింది. తాజాగా ఒక జెట్ విమానాన్ని కూడా కొనుగోలు చేసింది. ఇప్పుడు సెలెక్టెడ్ సినిమాలు మాత్రమే నటిస్తూ భర్త, పిల్లలతో టైమ్ ఎంజాయ్ చేస్తుంది. అలాగే చిన్న యాడల్లో నటిస్తూ దానికి కూడా కోట్లలో ఛార్జ్ చేస్తుంది. ప్రస్తుతం చెన్నైలో 53 ఏళ్ల క్రితం మూసివేయబడిన థియేటర్లను కొనుగోలు చేసిందట ఆ ప్లేస్లో మల్టీప్లెక్స్ లు నిర్మించాలని ప్లాన్ లో ఉందని తెలుస్తుంది.