అబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..17 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్టార్ హీరోయిన్ తో నటించబోతున్న చిరంజీవి..!!

ఎస్ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత మళ్లీ ఓ క్రేజీ కాంబో ని రిపీట్ చేయబోతున్నారా..? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు సినీ ప్రముఖులు.. మనందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ వరుస‌ సినిమాలో క‌మీట్ అవుతూ ఏ రేంజ్ లో చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య లాంటి బ్యాక్ టు బ్యాక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న చిరు. ప్రస్తుతం భోళా శంకర్ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.

Go Go Goa Full Song |Stalin||Chiranjeevi , Mani Sharma Hits | Aditya Music - YouTube

మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత కూడా మరో రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నారు మెగాస్టార్. అందులో ఒకటి బింబిసారాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వసిష్ట తో ఒకటి, సోగ్గాడే చిన్నినాయన, బంగారు రాజు వంటి సినిమాలు తో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి విజయం అందుకున్న కళ్యాణ్ కృష్ణతో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే వశిష్ట చిరంజీవితో ఓ సోషియో ఫాంటసీ సినిమా చేయడానికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే చిరంజీవి కథ చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట.

Trisha to get back to Tollywood with Chiranjeevi 152? Details inside - India Today

అలాగే మెగాస్టార్ కోసం మరో దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ కూడా ఎంతో విభిన్నమైన కథాంశం ఎంచుకున్నాడని.. ఇది కూడా ఎంతో డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇలా చిరంజీవి ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్లను సెలెక్ట్ చేసుకుని.. ఈ రెండు సినిమాల్లో ఓ సినిమాల్లో హీరోయిన్గా త్రిషను ఎంపిక చేస్తారట. గతంలో చిరుకు జంటగా త్రిష స్టాలిన్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు 17 సంవత్సరాలవుతుంది. మళ్లీ 17 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ కాబోతుండటంతో మెగా ఫాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మరి త్రిష- చిరంజీవి ఏ దర్శకుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి…?