నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా రూలర్. ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్‌ను కొద్ది సేపటి క్రితం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రం టీజర్, ఫస్ట్ లుక్‌లు ఇప్పటికే విడుదల అయ్యాయి. అయితే టీజర్ మాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు ట్రైలర్ మాత్రం భీభత్సం సృష్టిస్తుంది. ఈ ట్రైలర్ బాలయ్య అభిమానులను ఊపేపేలా దర్శకుడు కట్ చేశాడు.
గతంలో బాలయ్య నటించిన ఫ్యాక్షన్ సినిమాలను తలపించేలా ట్రైలర్ ఉంది. ఇక ఈ రూలర్ ట్రైలర్లో బాలయ్య తన మాస్, ఫ్యాక్షన్ సెంటిమెంట్‌ను మాత్రం వీడలేదని నిరూపించారు. బాలయ్య ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. అయితే ఒక పాత్ర పోలీసాఫీసర్‌గా కాగా, మరో పాత్ర సాప్ట్ కార్నర్‌గా ఉంది. అయితే పోలీసాఫీసర్ పాత్రలో బాలయ్య కొంత ఇబ్బంది కరంగా ఉన్నాడు.
ట్రైలర్‌లో బాలయ్య పంచ్ డైలాగ్‌లు ఏ మాత్రం తగ్గలేదు. గత చిత్రాల్లో తన వాయిస్ బేస్ ఎలా ఉండేదో ఇప్పడు అలాగే ఉంది. ఇక బాలయ్యతో రొమాన్స్‌తో హీరోయిన్లు సోనాల్ చౌహాన్, వేదికలు బాగానే చేశారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. బాలయ్య అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల 20న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నద్దం అయింది. సినిమాను సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. బాలయ్య మరోసారి ఫంచ్ డైలాగ్ లు, మాస్ యాక్షన్ ఆకట్టుకునేలా దర్శకుడు చిత్రాన్ని రూపొందించారు.