రియ‌ల్ హీరోకు రీల్ హీరో నివాళీ..!

అత‌డో రియ‌ల్ హీరో.. విద్యార్థి లోకంలో ఆయ‌న‌కు స‌ముచిత స్థానం ఉంది.. ఆయన పేరు వింటే కొంద‌రి గుండెల్లో గుబులు రేగేది… ఆయ‌న వ‌స్తుండంటేనే.. కొందరికి వెన్నులో వ‌ణుకు పుట్టేది.. విద్యార్థి లోకాన్ని త‌న భావ‌జాలంతో.. వాక్ప‌టిమ‌తో ఉత్తేజితుల‌ను చేశాడు.. ఓయూలో విప్ల‌వాల‌కు పురుడు పోసాడు.. అరాచ‌కాల‌కు స్వ‌ప్తి ప‌లికేలా ఉద్య‌మించాడు.. అన్యాయాల‌ను ఎదిరించాడు.. బాధిత విద్యార్థుల ప‌క్షం వ‌హించి పోరాటం చేశాడు.. అన్యాయాలు చేసే వారి పాలిట సింహ‌స్వ‌ప్నం అయ్యాడు..

ఓయూలో త‌న పోరాటంతో, మంచి త‌నంలో విద్యార్థి లోకంలో హీరోగా నిలిచాడు.. అంతే కాదు చ‌రిత్ర‌లో నిలిచిపోయిన రియ‌ల్ హీరోగా అవ‌త‌రించాడు.. ఆ రియ‌ల్ హీరోనే జార్జిరెడ్డి. అలాంటి రియ‌ల్ హీరోకు ఈరోజు రీల్ హీరో సందీప్. జార్జిరెడ్డి జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం జార్జిరెడ్డి. జార్జిరెడ్డి సమాధి దగ్గర చిత్రయూనిట్ ఘననివాళులర్పించింది. నారాయణగూడ స్మశానవాటికలో జార్జిరెడ్డి సమాధి దగ్గర పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.

హీరో సందీప్‌తో  పాటు, దర్శకుడు జీవన్, సహా చిత్ర యూనిట్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జార్జీరెడ్డి సినిమా రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతున్న త‌రుణంలో చిత్ర యూనిట్ జార్జిరెడ్డి స‌మాధి వ‌ద్ద నివాళి అర్పించ‌డం విశేషం. జార్జిరెడ్డి సినిమా ట్రైల‌ర్ ఇప్ప‌టికే విడుద‌ల అయింది. సినిమా ట్రైల‌ర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నాడు. సినిమాను వివాదాల్లోకి లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు రాజాసింగ్. ఈ నేప‌థ్యంలో సినిమా శుక్ర‌వారం విడుద‌ల కానున్న‌ది. 

Tags: George Reddy, Samadhi, Sandeep Madhav, Tribute