యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రూలర్’. కే.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా మారిపోయాడు. ఇక ఇప్పటికే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న థియేటర్లలోకి వస్తోన్న రూలర్ సినిమా టీజర్ ఈ రోజు విడుదల అయ్యింది.
1.15 నిమిషాల పాటు ఉన్న టీజర్లో బాలయ్య మార్క్ సీన్లే ఉన్నాయి. ఈ సినిమాలో కథ ప్రకారం బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత పోలీస్ నుంచి గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేది ఈ సినిమా స్టోరీ. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్లో చూస్తుంటే బాలయ్య రెండు షేడ్స్‌లో నటిస్తాడని తెలుస్తోంది.
ధర్మ మా ఊరికి గ్రామ దైవం.. ఎవరికి ఏ కష్టం వచ్చినా తానే ముందుంటాడు… ఒంటిమీద కాకీ యూనీఫాం ఉంటేనే బోనులో ఉన్న సింహాన్ని.. కాకీ తీస్తే బయటకు వచ్చిన సింహాన్ని.. ఇక వేటే అన్న పంచ్ డైలాగులు బాగున్నాయి. టీజర్ కలర్‌ఫుల్‌గా ఉంది… సోనాల్ చౌహాన్ బికినీ వేసుకుని స్విమ్మింగ్ ఫూల్ నుంచి వస్తున్నట్టు కూడా ఉంది.
విలన్లు చాలా వపర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. టీజర్ అంతా యాక్షన్ కట్స్‌తోనే నింపేశారు. సోనాల్ చౌహాన్ రోల్‌కు కూడా ప్రాధాన్యం కనిపిస్తోంది. ఈ సినిమా కోసం పూర్తిగా యంగ్ గా మరిపోయిన బాలయ్య లుక్‌ను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న రూలర్ ఏం చేస్తుందో ? చూడాలి.