తానాజీ సినిమా కలెక్షన్లు తెలిస్తే.. వావ్‌ అనాల్సిందే

బాలివుడ్‌ అగ్రహీరో అజయ్‌దేవగణ్‌ నటించిన తానాజీ సినిమా బాక్సాఫీసు వద్ద కోట్లను కొల్లగుడుతున్నది. రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతున్నది. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నది. మరాఠ యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్‌ దగ్గర సుబేదార్‌గా పనిచేసి ఆయన సాధించిన విజయాల్లో కీలకభూమిక పోషించిన తానాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఓం రౌత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో అజయ్‌దేవగణ్‌ లీడ్‌ రోల్‌ను పోషించగా, ఆయన సరసన నిజజీవిత భాగస్వామి అయిన కాజల్‌నే నటించడం విశేషం. అంతేకాదండోయ్‌ ఇది ఆయన వందో చిత్రం కాగా, దీనిని టీసిరీస్‌తో అజయ్‌దేవగణ్‌ నిర్మించడం మరో విశేషం.

జనవరి 10వ తేదీన విడుదలైన ఈ చిత్రం బాలివుడ్‌లో రికార్డులను తిరగరాస్తున్నది. భారీ వసూళ్లను రాబడుతున్నది. ఇప్పటికే పది రోజుల్లోనే రూ. 150కోట్లకు పైగా షేర్‌ను సాధించినట్లు బాలివుడ్‌ ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. నార్త్‌ సర్కిల్‌లో ఈ చిత్రం తన సత్తా చూపుతున్నది. రూ. 200 కోట్ల వసూలు దిశగా సాగుతుండడం గమనార్హం. ఇప్పటికే చిత్రానికి పలు ఉత్తరాది రాష్ట్రాలు వినోదపు పన్నును మినహాయింపును ప్రకటించాయి. సినిమా ఇంకా ఎంత మొత్తం వసూలు చేస్తుందోనని బాలివుడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags: ajaydevghan, kajol, om routh, thanhaji movie collections