జాను టీజ‌ర్‌.. అభిమానుల్లో హుషార్‌..

అక్కినేని స‌మంత‌, శ‌ర్వానంద్ జంట‌గా తెర‌కెక్కుతున్న జాను చిత్రం టీజ‌ర్ విడుద‌లైంది. తెలుగు సినీ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్న‌ది. చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన కొద్ది నిముషానే ఈ ప్ర‌చార వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెగ చ‌క్కెర్లు కొడుతున్న‌ది. సినిమాపై అంచ‌నాల‌ను భారీగా పెంచుతున్న‌ది. విజువ‌ల్స్ క‌ళ్ల‌ను క‌ట్టిప‌డేస్తున్నాయి. ప్ర‌కృతి అందాలు, హీరో శ‌ర్వానంద్ గెట‌ప్ స‌రికొత్త‌గా ఉన్నాయి. భారీ విష‌యం ద‌క్క‌నుంద‌ని టాలివుడ్ వ‌ర్గాలు అప్ప‌డే తేల్చేస్తున్నారు.

త‌మిళ‌లో హిట్ట‌యిన 96 మూవీని తెలుగులో జాను పేరుతో రీమేక్ చేస్త‌న్న విష‌యం తేలిసిందే. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న‌ది. అదేవిధంగా ఇటీవ‌లే విడుద‌ల చేసిని సినిమాలోని ఉహ‌లే ఉహ‌లే పాట కూడా శ్రోత‌ల‌ను రంజిప‌జేస్తున్న‌ది. జనాల గుండెల్లోకి చొచ్చుకుపోయింది. సినిమాకు సంగీతం గోవింద్ వసంత. అందించ‌గా ఆ పాటను శ్రీపాద చిన్మయి పాట‌డ‌డం విశేషం. తాజా విడుద‌ల చేసిన టీజ‌ర్ కూడా అక్కినేని అభిమానుల‌ను, శ‌ర్వానంద్ ఫ్యాన్స్‌ను మురిపిస్తున్న‌ది.

http://https://youtu.be/dxRDHXsQ2YQ

Tags: akkineni samntha, jhanu movie teaser, shrvanandh