టాలీవుడ్లో ఇద్దరు అగ్ర నిర్మాతలు.. ఒకరు మూవీ మొగల్ స్వర్గీయ డాక్టర్ రామానాయుడు నెలకొల్పిన చిత్ర నిర్మాణ సంస్థకు, పంపిణి సంస్థకు అధిపతిగా ఉన్న దగ్గుబాటి సురేష్‌బాబు. ఇంకొకరు పంపిణిదారుడిగా, ప్రముఖ నిర్మాతగా ఎదిగిన దిల్ రాజు. ఇద్దరు ఇప్పుడు టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతలుగా రాజ్యమేలుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లుగా, నిర్మాణ సంస్థలకు అధిపతులుగా ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు తమ సినిమాల విషయంలో ఎడతెరిపిలేని చర్చలతో మునిగిపోయారు.
ఇద్దరు నిర్మించిన రెండు చిత్రాలు ఇప్పుడు క్రాష్ కాబోతున్నాయి. దీంతో ఇద్దరికి అటు నష్టమో.. లాభమో రావడం ఖాయం. లాభం వస్తే ఇబ్బంది ఏమీ లేదు. కానీ నష్టం వస్తే నిర్మాతగా ఇద్దరికి భారీ నష్టమే కదా.. అందుకే ఇద్దరు తమ సినిమాలు క్రాష్ కాకుండా చూసుకునేందుకు గత కొంత కాలంగా చర్చోపచర్చలు జరుపుతూనే ఉన్నారు. కానీ ఇద్దరి మదిలో సినిమా విడుదలకు అనుకూలమైన సమయం కోసమే ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు ఓ నిర్ణయానికి వచ్చారు. అందేంటంటే.. ఈ రెండు సినిమాలు ఎట్టి పరిస్థితిలో క్రాష్ కాకుండా చూసుకోవాలని.
ఇంతకు ఈ రెండు సినిమాలు ఏంటీవి అనుకుంటున్నారా.. సురేష్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం వెంకిమామ. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య నటిస్తున్నారు. మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ఇప్పటికే అనేకసార్లు విడుదల తేదిపై సందిగ్ధం ఏర్పడింది. అయితే ఇప్పుడు డిసెంబర్ 25న విడుదల చేసేందుకు, రాజ్ తరుణ్‌తో తెరకెక్కించిన చిత్రం ఇద్దరి లోకం ఒకటే సినిమా డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 13కు ముందుకు జరిగాడు. దీంతో ఈ రెండు సినిమాలు క్రాష్ కావడం లేదు. ఇలా ఇద్దరు నిర్మాతలు తమ సినిమాల కోసం ఒక్కటయ్యారు. ఇది సిని పరిశ్రమకు శుభపరిణామమే అని చెప్పవచ్చు.